Raj Tarun : నాకు జీవితంలో పెళ్లి, పిల్లలు వద్దు.. సంచలన నిర్ణయం తీసుకున్న యువ హీరో..
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు.
- Saketh U
- Published On : April 22, 2024 / 09:17 AM IST
Raj Tarun says No Marriage for Life Long why he Decide that Comments goes Viral
Raj Tarun : ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్తా మావా, కుమారి 21F.. ఇలా రావడంతోనే హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో రాజ్ తరుణ్ స్టార్ హీరో అయిపోతాడు అనుకున్నారు అంతా. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయి అనుకోకుండా హీరో అయి సక్సెస్ కొట్టాడు రాజ్ తరుణ్. కానీ ఆ తర్వాత అక్కడక్కడా హిట్స్ తప్ప మిగిలినవి అన్ని ఫ్లాప్స్ పడటంతో రాజ్ తరుణ్ కెరీర్ నిదానంగా సాగుతుంది. ఇటీవల సంక్రాంతికి నాగార్జున ‘నా సామి రంగ’ సినిమాలో ఓ క్యారెక్టర్ పోషించాడు. హీరోగా వచ్చి రెండేళ్లు అవుతుంది. త్వరలో తిరగబడరా సామీ, భలే ఉన్నాడే, పురుషోత్తముడు సినిమాలతో రాబోతున్నాడు.
ప్రస్తుతం రాజ్ తరుణ్ సినిమాలు, సిరీస్ లతో బిజీగానే ఉన్నాడు. టాలీవుడ్ బ్యాచిలర్స్ లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. కానీ బాడీ, ఫిట్నెస్ మాత్రం మెయింటైన్ చేస్తూ ఇంకా కుర్రాడిలాగా కనిపిస్తాడు. 31 సంవత్సరాలు ఉన్న ఈ అందగాడు పెళ్లి మాత్రం వద్దంటున్నాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు.
Also Read : Nayanthara – Vignesh Shivan : క్యూట్ కపుల్.. నయనతార, విగ్నేష్ శివన్ ట్రెడిషినల్ ఫొటోలు..
రాజ్ తరుణ్ ని పెళ్లి గురించి అడగ్గా.. ఏది ఏమైనా సరే జీవితంలో పెళ్లి మాత్రం చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యాను. నాకు పెళ్లి, పిల్లలు వద్దు. నేను సింగిల్ గా హ్యాపీగా ఉన్నాను. పెళ్లి విషయంలో మా నాన్న నా ఇష్టం అంటారు. అమ్మ మాత్రం మొదట్లో అడిగేది, ఇప్పుడు నా ఇష్టం అని వదిలేసింది అని తెలిపాడు. దీంతో రాజ్ తరుణ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మన టాలీవుడ్ లో ప్రభాస్, నవదీప్, అఖిల్, సాయి ధరమ్ తేజ్.. ఇలా పెళ్లిళ్లు చేసుకోవాల్సిన హీరోలు ఉన్నారు. వీరిని పెళ్లి గురించి అడిగితే చేసుకుందాంలే, నచ్చిన అమ్మాయి దొరకాలి అని అయినా చెప్తున్నారు. కానీ రాజ్ తరుణ్ అసలు పెళ్లి చేసుకోను అని చెప్పడంతో ఆశ్చర్యపోతున్నారు. మరి ఫ్యూచర్ లో కూడా ఇదే మాట మీద ఉంటాడా? మారతాడా చూడాలి.
