rajamouli emotional comments on prabhas
Rajamouli : రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ అవార్డుల వేట కొనసాగుతూనే ఉంది. బిఫోర్ ఇండిపెండెన్స్ కథనంతో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ – అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ – కొమరం భీమ్‌గా నటించారు. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా.. ఇంటర్నేషనల్ మూవీస్‌కి పోటీగా నిలుస్తుంది. అనేక అంతర్జాతీయ పురస్కారాల్లోఅవార్డులు అందుకుంటూ భారతీయ సినిమా ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేస్తుంది.
RRR : 24 ఏళ్ళ రజిని రికార్డుని బ్రేక్ చేసిన రాజమౌళి..
తాజాగా రాజమౌళి.. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల్లో ‘బెస్ట్ డైరెక్టర్’ అవార్డుని అందుకున్నాడు. అలాగే లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడి రేస్‌లో ‘రన్నరప్’గా నిలిచాడు. ఇదే లాస్ ఏంజెల్స్ అవార్డ్స్ లో ఎం ఎం కీరవాణి కూడా ‘బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్’గా RRR గాను అవార్డుని అందుకున్నాడు. దీంతో ప్రభాస్ వీరిద్దరికి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభినందనలు తెలియజేస్తూ ఒక పోస్ట్ చేశాడు.
ఇక ఆ పోస్ట్‌కి జక్కన్న రిప్లై ఇస్తూ.. “థాంక్యూ డార్లింగ్. నా మీద నాకు నమ్మకం లేని సమయంలో, నువ్వు నన్ను నమ్మావు. నాలోనే అంతర్జాతీయ సినీ సాంకేతిక నిపుణుడిని మొదటిగా నువ్వే గుర్తించావు” అంటూ ఎమోషనల్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్ గా మారింది. కాగా ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నామినేషన్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ‘బెస్ట్ పిక్చర్ – నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నామినేషన్స్ లో నిలిచింది.