రాజమౌళి ఫ్రెండ్ సంచలన వీడియో.. నన్ను టార్చర్ చేస్తున్నాడు.. 30 ఏళ్ళ జీవితం త్యాగం చేశా..

తాజాగా రాజమౌళి స్నేహితుడు సంచలన ఆరోపణలు చేసారు.

రాజమౌళి ఫ్రెండ్ సంచలన వీడియో.. నన్ను టార్చర్ చేస్తున్నాడు.. 30 ఏళ్ళ జీవితం త్యాగం చేశా..

Rajamouli Friend Sensational Comments on him wants to file a Case on Rajamouli

Updated On : February 27, 2025 / 2:35 PM IST

Rajamouli : బాహుబలితో ఇండియా వైడ్, RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి – మహేష్ బాబు సినిమా షూటింగ్ దశలో ఉంది.

అయితే తాజాగా రాజమౌళి స్నేహితుడు సంచలన ఆరోపణలు చేసారు. రాజమౌళి స్నేహితుడు యు.శ్రీనివాసరావు అనే వ్యక్తి.. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉంది. రాజమౌళి టార్చర్ భరించలేను, ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో చేసారు. అలాగే ఓ లెటర్ కూడా రాసి ఈ సెల్ఫీ వీడియో, లెటర్‌ ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసాడు. ఇతను పలు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేసినట్టు సమాచారం.

Also Read : Kiran Abbavaram : బేబీ బంప్ తో కిరణ్ అబ్బవరం భార్య.. స్పెషల్ ప్లేస్ లో శివరాత్రి సెలబ్రేట్ చేసుకున్న క్యూట్ కపుల్..

రాజమౌళి స్నేహితుడు శ్రీనివాసరావు ఈ వీడియోలో మాట్లాడుతూ.. ఎంఎం కీరవాణి, చంద్రశేఖర్ యేలేటి, గుణ్ణం గంగరాజు, హను రాఘవపూడి, మైత్రి మూవీ సీఈఓ చెర్రీ.. వీళ్లందరితో నేను పనిచేసాను. వీళ్ళందరికీ మా స్నేహం గురించి తెలుసు. నాది, రాజమౌళిది 34 ఏళ్ళ స్నేహం. యంగ్ ఏజ్ లో నా లైఫ్, రాజమౌళి లైఫ్ లోకి ఒక అమ్మాయి ప్రవేశించింది. మాది ఆర్య 2 లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ. కానీ నేను త్యాగం చేశాను. రాజమౌళి నన్ను త్యాగం చెయ్యమన్నాడు. ఇదంతా శాంతి నివాసం సీరియల్ టైం కంటే ముందు జరిగిన విషయం. అయితే రాజమౌళి నెంబర్ 1 డైరెక్టర్ అయ్యాక నేను ఇవన్నీ ఎవరికో చెప్పేసాను అని నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. నా 30 ఏళ్ళ జీవితం వాడి కోసం త్యాగం చేశాను. ఓ సారి మా ఇద్దరి మధ్య చిన్న గొడవ అయినప్పుడు మన స్టోరీని సినిమా తీస్తానని అనడంతో అప్పట్నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు. రాజమౌళి ఫ్యామిలీ అంతా నాకు దూరం అయ్యారు. నేను గాడ్సేని కాదు అతన్ని మహాత్ముడిని చేయడానికి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు 55 ఏళ్ళు వచ్చేసాయి. రాజమౌళి వల్ల నాకు పెళ్లి కాలేదు. అమ్మాయిల జోలికి వెళ్ళకండి, కెరీర్ బాగు చేసుకోండి. ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయిపోయింది. ఎప్పుడో మొదలైన స్నేహం అతనికి చెప్పినా అర్ధం కావట్లేదు, నేను ఎవరికో ఆ స్టోరీ అంతా చెప్పాను అనుకోని టార్చర్ చేస్తున్నాడు. దీనికి సాక్షాలు ఏమి లేవు. ఇదంతా మా మధ్యే జరిగింది. ఈ నా మరణ వాంగ్మూలంను సుమోటో కేసు గా పోలీసులు తీసుకోవాలి అని అన్నారు.

అయితే ఈ వివాదం గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. మరి దీనిపై రాజమౌళి స్పందిస్తాడా లేదా చూడాలి.