Rajamouli : జపాన్‌లో RRR రీ రిలీజ్.. రాజమౌళికు గ్రాండ్ వెల్కమ్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన జక్కన్న..

జపాన్ ఫ్యాన్స్ RRR సినిమా రిలీజయి రెండేళ్లు అవుతున్నా ఇంకా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా జపాన్ లో RRR సినిమాని రీ రిలీజ్ చేశారు. దీంతో రాజమౌళి మరోసారి జపాన్ కి వెళ్లారు.

Rajamouli gets grand Welcome in Japan for RRR Re Release

Rajamouli : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ RRR సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2022లో రిలీజయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంచి హిట్ కొట్టి అనేక ఇంటర్నేషనల్ అవార్డులు అందుకొని ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి బెస్ట్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించి ఇండియన్ సినీ పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇక RRR సినిమాని అనేక దేశాల్లో రిలీజ్ చేసారు. అందులో జపాన్ కూడా ఒకటి. మన ఇండియన్ సినిమాలకు అమెరికా తర్వాత జపాన్ అతిపెద్ద ఇంటర్నేషనల్ మార్కెట్. ముఖ్యంగా తెలుగు సినిమాలకు. దీంతో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీలతో కలిసి మరీ వెళ్లి RRR సినిమాని జపాన్ లో ప్రమోట్ చేసారు. ఇప్పటివరకు ఏ సినిమా సాధించని రికార్డు కలెక్షన్స్ జపాన్ లో RRR సాధించింది. అంతే కాకుండా జపాన్ ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నారు.

Also Read : Nuvvu Nenu : వెండితెరపై మరోసారి ఉదయ్ కిరణ్.. ‘నువ్వు నేను’ రీ రిలీజ్.. ఎప్పుడంటే?

జపాన్ ఫ్యాన్స్ RRR సినిమా రిలీజయి రెండేళ్లు అవుతున్నా ఇంకా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పై అభిమానం చూపిస్తున్నారు. తాజాగా జపాన్ లో RRR సినిమాని రీ రిలీజ్ చేశారు. దీంతో రాజమౌళి మరోసారి జపాన్ కి వెళ్లారు. ఇక రాజమౌళి జపాన్ కి వెళ్లడంతో అక్కడి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. రాజమౌళిని చూసి అభిమానులు సంతోషిస్తున్నారు.

అయితే ఓ బామ్మ రాజమౌళి కోసం స్పెషల్ గిఫ్ట్ చేసుకొచ్చింది. దీంతో రాజమౌళి ఆ గిఫ్ట్ తీసుకొని ఆ బామ్మతో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. జపాన్ లో ఆర్గామి క్రేన్స్ అనే గిఫ్ట్ తమకి ఇష్టమైన వాళ్ళ కోసం, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, బాగుండాలని తయారుచేస్తారు. ఒక 83 ఏళ్ళ మహిళ అలాంటివి 1000 తయారుచేసి తీసుకొచ్చి నన్ను ఆశీర్వదించింది. RRR ఆమెకు సంతోషం ఇచ్చింది. నాకు గిఫ్ట్ పంపి బయట చలిలో ఎదురుచూస్తుంది. ఇలాంటి వాటికి ఋణం తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసారు. దీంతో రాజమౌళి ట్వీట్ వైరల్ గా మారింది.

ఇక రాజమౌళి జపాన్ కి రావడంతో జపాన్ అభిమానులు రాజమౌళి ఫొటోలతో, RRR సినిమా ఫొటోలతో గిఫ్టులు తయారుచేస్తూ, రాజమౌళితో ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. RRR ట్విట్టర్ అకౌంట్ జపాన్ వాళ్ళు పోస్ట్ చేసినవి అన్ని రీ షేర్ చేయడం గమనార్హం. సినిమా రిలీజయి రెండేళ్ల తర్వాత కూడా జపాన్ వెళ్తే అదే రేంజ్ లో స్పందన రావడం గర్వంగా చెప్పుకోదగిన విషయం. దీనిపై RRR మూవీ యూనిట్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు