Rajamouli received the Best Director Award in New York Film Crictics Circle
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసందే. ఈ చిత్రం ఇంటర్నేషనల్ వేదికల్లో పలు అవార్డులు అందుకుంటూ చరిత్ర సృష్టిస్తుంది. ఇటీవలే ఆస్కార్ అవార్డ్స్‌కి కూడా బెస్ట్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. కాగా ఇప్పుడు తెలుగు దర్శకుడైన రాజమౌళి ఇంగ్లీష్ గడ్డపై ఉత్తమ దర్శకుడిగా అవార్డుని అందుకొని భారతీయ సినీపరిశ్రమ వైపు అందరూ చూసేలా చేశాడు.
RRR : చైనాలో రిలీజ్‌తోనే రికార్డు సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’..
ఈ సినిమా పలు కేటగిరీలో న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ నామినేషన్స్ లో నిలవగా.. రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ అవార్డుని గెలుచుకున్నాడు. ఈ అవార్డుల పురస్కారాలు నిన్న రాత్రి ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు రాజమౌళి, కార్తికేయ, బాహుబలి నిర్మాత శోబు యార్లగడ్డ సతీసమేతంగా హాజరయ్యారు. ఇక అక్కడ అవార్డు అందుకున్న రాజమౌళి ఫోటోలను నిర్మాత శోబు తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ అభినందనలు తెలియజేశాడు.
ఇక ఈ అవార్డుల పురస్కారానికి రాజమౌళి భారతీయ సాంప్రదాయ లుక్‌లో పంచె కట్టులో వెళ్ళాడు. ఆ ఫోటోలు చూసిన నెటిజెన్లు భారతీయ సినిమాని ప్రపంచదేశాలకు పరిచయం చేయడమే కాకుండా మన సాంప్రదాయాన్ని కూడా పరిచయం చేసేలా ఉన్న రాజమౌళి డ్రెస్సింగ్ చూసి హ్యాట్సాఫ్ అంటున్నారు. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ని కూడా అందుకోడానికి మూవీ టీం సిద్ధమైంది. ఇందుకోసం చరణ్ నేడు అమెరికా పయనమయ్యాడు. తారక్ హాలిడే వెకేషన్‌తో ఆల్రెడీ అమెరికాలోనే ఉన్నాడు.
.@ssrajamouli accepting the Best Director award @nyfcc ! ???#RRR pic.twitter.com/CxFFy90jpp
— Shobu Yarlagadda (@Shobu_) January 5, 2023