The Roar of RRR: రాజమౌళి జిత్తులు మరోసారి చూపించాడుగా..

'ద రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' అంటూ అనౌన్స్ చేసిన సమయానికే మేకింగ్ వీడియో రిలీజ్ చేశాడు రాజమౌళి. సినిమాపై ఉన్న అంచనాలను అందుకునేలా 2నిమిషాల లోపు వీడియోను రెడీ చేసి విడుదల చేశారు.

The Roar of RRR: రాజమౌళి జిత్తులు మరోసారి చూపించాడుగా..

The Roar Of Rrr

Updated On : July 17, 2021 / 10:06 PM IST

The Roar of RRR: ‘ద రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ అంటూ అనౌన్స్ చేసిన సమయానికే మేకింగ్ వీడియో రిలీజ్ చేశాడు రాజమౌళి. సినిమాపై ఉన్న అంచనాలను అందుకునేలా 2నిమిషాల లోపు వీడియోను రెడీ చేసి విడుదల చేశారు. బ్రిటీష్ రాజ్యంలో అణగదొక్కబడిన మన వాళ్ల గురించి చూపిస్తూనే.. పాత్రల హీరోయిజాన్ని కళ్లకు కట్టాడు.

అయితే ఈ వీడియో రిలీజ్ కావడానికి ముందు చాలా మంది సినిమా బేసిక్ కాన్సెప్ట్ ఎంతోకొంత తెలుస్తుందని భావించారు. రెండు నిమిషాల వీడియోను చూసినా.. సెట్స్ గురించి గానీ, కాన్సెప్ట్ గురించి గానీ ఏ మాత్రం లీక్ కాకుండా కాపాడుకున్నాడు రాజమౌళి.

ఇద్దరు మల్టీస్టారర్లు ఉన్న షాట్స్ కూడా కనపడకుండా జాగ్రత్తపడ్డాడు. పోస్టర్లకు మాత్రమే పరిమితమైన జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి ఉన్న షాట్స్ వీడియోలో కనిపించలేదు. మరోసారి తన తెలివితేటలు చూపిస్తూ.. బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్ అని ప్రూవ్ చేసుకున్నాడు జక్కన్న.