×
Ad

Rajashekar : ‘బులెట్ సునీల్’ గ్లింప్స్ అదిరిందిగా.. రాజశేఖర్ కంబ్యాక్ సినిమా గ్యారెంటీ..

తాజాగా బైకర్ సినిమా నుంచి రాజశేఖర్ పాత్ర బుల్లెట్ సునీల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. (Rajashekar)

Rajashekar

Rajashekar : ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో మెప్పించిన యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. త్వరలో శర్వానంద్ బైకర్ సినిమాతో రాబోతున్నారు రాజశేఖర్. బైక్ రేసింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న బైకర్ సినిమా ఏప్రిల్ 3 న రిలీజ్ కానుంది.(Rajashekar)

ఆల్రెడీ బైకర్ టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు నెలకొల్పారు. తాజాగా బైకర్ సినిమా నుంచి రాజశేఖర్ పాత్ర బుల్లెట్ సునీల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో ఒకప్పుడు రాజశేఖర్ పాత్ర పవర్ ఫుల్ బైక్ రేసర్ అన్నట్టు చూపించారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే రాజశేఖర్ ని మళ్ళీ చాన్నాళ్ల తర్వాత పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Prithviraj Sukumaran : పృథ్వీ ఈగలకు దండం పెట్టుకున్నాడు.. వారణాసి షూటింగ్‌లో ఫన్నీ సంగతులు చెప్పిన మహేష్..

దీంతో ఇది రాజశేఖర్ కి గ్యారెంటీగా కంబ్యాక్ సినిమా అవుతుంది, ఇక నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ అదరగొడతారు అని రాజశేఖర్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ అంటున్నారు.

బైకర్ నుంచి రిలీజయిన బుల్లెట్ సునీల్ గ్లింప్స్ మీరు కూడా చూసేయండి..

Also Read : Varanasi : వారణాసి రెండు పార్టులు.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. ఊపిరి పీల్చుకున్న మహేష్ ఫ్యాన్స్..