Panchali Panchabhartruka : ‘పాంచాలి పంచభర్తృక’ అంటున్న రాజేంద్రప్రసాద్.. మరోసారి కామెడీ సినిమాతో..

తాజాగా మూవీ యూనిట్ మీడియాతో మాట్లాడింది. (Panchali Panchabhartruka)

  • Published on- May 10, 2026 / 07:06 AM IST

Rajendra Prasad

Panchali Panchabhartruka : రాజేంద్రప్రసాద్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా పాంచాలి పంచభర్తృక. యల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్స్ పై రాజ్ పవన్, వెంకట్ దుగ్గిరెడ్డి నిర్మాణంలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి గ్లింప్స్, ఓ రెట్రో స్టైల్ సాంగ్ కూడా రిలీజ్ చేసారు. తాజాగా మూవీ యూనిట్ మీడియాతో మాట్లాడింది.

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో నాకు ఇలాంటి పాత్ర రావడం చాలా అరుదు. ఈ సినిమాలో పాట, ఫైట్ లతో మళ్ళీ మీ అప్పటి రాజేంద్రప్రసాద్ ని చూస్తారు అని అన్నారు. ఈ సినిమాలో ర్యాప్ సింగర్ రోల్ రైడర్ హీరోగా కనిపించబోతున్నాడు. రోల్ రైడా మాట్లాడుతూ.. సినిమా మొత్తం నవ్వుతూనే చూస్తారు. ప్రేక్షకుడికి మంచి ఫన్ ట్రీట్ ఈ సినిమా అని అన్నారు.

Also Read : Rashmika Mandanna : పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ ఫస్ట్ బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన రష్మిక..

నిర్మాత, నటుడు వెంకట్ దుగ్గిరెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు యాసలో కామెడీ చెయ్యడం అనేది నాకు వ్యక్తిగతంగా సరిపోయే పాత్ర. ఇలాంటి పాత్రలు చేసినప్పుడు మనలో ఉన్న అసలు నటుడు బయటికి వస్తాడు అని అన్నారు. నిర్మాత రాజ్ పవన్ మాట్లాడుతూ.. ఖర్చుకు వెనకాడకుండా క్వాలిటీలో రాజి పడకుండా ఈ సినిమాని నిర్మించామని తెలిపారు. డైరెక్టర్ గంగ సప్తశిఖర మాట్లాడుతూ.. బాబీ అందించిన బలమైన కథ చెప్పడానికి కామెడీని ఎంచుకున్నాను. రెండు గంటలు ప్రేక్షకులని నవ్వించడం పెద్ద టాస్క్. ప్రేక్షకులకి నచ్చే మెచ్చే సినిమా ఈ పాంచాలి పంచభర్తృక. ఈ సినిమాలో డైలాగ్స్ కచ్చితంగా ట్రెండ్ అవుతాయి అని అన్నారు.