Annaatthe : ఫెస్టివల్‌కి సూపర్‌స్టార్ డబుల్ ట్రీట్..
వినాయక చవితి నాడు సూపర్‌స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు రెండు సర్‌ప్రైజెస్ ఇవ్వబోతున్నారు..
- sekhar
- Published on- September 9, 2021 / 02:24 PM IST
Annaatthe
Annaatthe: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘అన్నాత్తే’ ను దీపావళి కానుకగా 2021 నవంబర్ 4న రిలీజ్ చేయనున్నారు.
Annaatthe Deepavali : తలైవా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా ‘అన్నాత్తే’..
వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 రోజు సూపర్‌స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు రెండు సర్‌ప్రైజెస్ ఇవ్వబోతున్నారు.. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అన్నాత్తే’ ఫస్ట్‌లుక్ రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చెయ్యబోతున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు ‘అన్నాత్తే’ మోషన్ పోస్టర్ వీడియో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు టీం.
MAA Building : మోహన్ బాబుకి నాగబాబు కౌంటర్..
ఈ సందర్భంగా వదలిన ప్రీ లుక్ పోస్టర్‌లో పంచెకట్టులో ఉన్న రజినీని వెనుక నుంచి చూపించారు. పండుగ పూట ఒకే సినిమాకి సంబంధించి రెండు అప్‌డేట్స్ రానుండడంతో తలైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. రజినీ సరసన నయనతార కథానాయికగా నటించగా.. ప్రకాష్ రాజ్, ఖుష్బు, మీనా, జగపతి బాబు, కీర్తి సురేష్, కమెడియన్లు సూర్య, సతీష్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు..
