Jailer : ‘జైలర్’పై నెగిటివ్ రివ్యూ.. ఇద్దరిని చితక్కొట్టిన రజనీకాంత్ అభిమానులు..
నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన సినిమా ‘జైలర్'(Jailer). ప్రపంచ వ్యాప్తంగా నేడు (ఆగస్టు 10 గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
- Thota Vamshi Kumar
- Published on- August 10, 2023 / 08:55 PM IST
Rajinikanth fans beat Chennai men
Jailer review : నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన సినిమా ‘జైలర్'(Jailer). ప్రపంచ వ్యాప్తంగా నేడు (ఆగస్టు 10 గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా కొన్ని చోట్ల రజనీకాంత్ అభిమానులు థియేటర్ల వద్ద పటాకులు కాల్చారు. పూజలు చేయడంతో పాటు రజనీకాంత్ కటౌట్లకు పూల దండలు వేశారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. సినిమా పై నెగిటివ్ రివ్యూ ఇచ్చినందుకు ఇద్దరు వ్యక్తులను ఫ్యాన్స్ చితక్కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. క్రోమ్ పేట్ ప్రాంతంలోని వెట్రి థియేటర్ వద్ద సినిమా ఎలా ఉంది అంటూ విలేకరులు రివ్యూలు తీసుకుంటుండగా ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. దీంతో కోపంతో ఊగిపోయిన రజనీకాంత్ అభిమానులు వారిద్దని కొట్టారు. వీరిద్దరూ ‘దళపతి’ విజయ్ అభిమానులనీ.. ‘తలైవర్’ సినిమాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫ్యాన్స్ ఆరోపించారు.
Mahesh Babu: భోళా శంకర్ సినిమా విడుదలకు కోర్టులో లైన్ క్లియర్ అవ్వగానే మహేశ్ బాబు ట్వీట్
జైలర్ సినిమా ఆడియో లాంఛ్ సందర్భంగా తలైవర్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై విజయ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ గత చిత్రం బీస్ట్. ఈ సినిమాలో విజయ్ హీరో. ఈ సినిమా బాగాలేదని చాలా మంది చెప్పారని, నెల్సన్‌తో పని చేయడం పై మరోసారి ఆలోచించుకోవాలని చాలా మంది తనకు ఫోన్ చేసి చెప్పారని రజనీకాంత్ అన్నారు. సినిమాకి నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్స్‌కి మాత్రం ఎటువంటి లాస్ రాలేదని, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిందని రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ మాటలు విజయ్ అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చ చేశారు.
జైలర్ సినిమా విషయానికి వస్తే.. సన్ పిక్చర్స్ దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా (Tamannaah) కన్నడ నటుడు శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మోహన్ లాల్ (Mohanlal), రమ్య కృష్ణ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. వింటేజ్ రజనీకాంత్ కనిపించాడని ఫ్యాన్స్ అంటున్నారు.
