Rajinikanth : ప్రముఖ నటుడు, రజినీకాంత్ మిత్రుడు కన్నుమూత.. శోక సంద్రంలో తమిళ పరిశ్రమ

తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.ఒకప్పటి హీరో, ప్రముఖ నటుడు శ్రీకాంత్ కన్నుమూశారు. ఒకప్పుడు హీరోగా చేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా తమిళ్ లో ఎన్నో సినిమాల్లో

  • Published On : October 13, 2021 / 05:21 PM IST

Srikanth

Rajinikanth :  తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.ఒకప్పటి హీరో, ప్రముఖ నటుడు శ్రీకాంత్ కన్నుమూశారు. ఒకప్పుడు హీరోగా చేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో భైరవి, సాధురంగం.. లాంటి మరెన్నో చిత్రాలలో కలిసి పని చేశారు. ఈయన రజినీకాంత్ కి మంచి మిత్రుడు. ప్రస్తుతం సినిమాలకు దూరమై చెన్నైలో నివసిస్తున్నారు. వయసు పైబడడంతో వచ్చిన అనారోగ్య కారణాలతో ఆయన సహజ మరణం పొందారు. ఆయనకి ఎంతోమంది కోలీవుడ్‌ స్టార్స్‌ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు తెలిపారు. రజనీకాంత్ కూడా శ్రీకాంత్ మృతి పై.. నా ప్రియమైన స్నేహితుడి మరణం నన్ను చాలా బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Akhil : విరాట్ కోహ్లీ బయోపిక్ లో అఖిల్ ??

కమల్‌ హాసన్‌ కూడా ఆయన మృతిపై విచారం వ్యక్తం చేస్తూ.. కథానాయకుడు, విలన్, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచిన శ్రీకాంత్‌ని బరువైన హృదయంతో పంపిస్తున్నాము అని ట్విట్టర్లో పోస్ట్ చేసారు. శ్రీకాంత్‌ తన చివరి ఇంటర్వ్యూలో రజనీకాంత్‌ని కలవాలనే కోరికను వ్యక్తం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ కోరిక నెరవేరకుండానే ఆయన కన్నుమూశారు. తమిళ్ లో ఒకప్పటి స్టార్ హీరోలందరితోను కలిసి పని చేశారు. సోషల్ మీడియా వేదికగా తమిళ్ స్టార్ హీరోలు, ఆర్టిస్టులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.