Jailer 2 : నేడే జైలర్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్.. అనిరుధ్ లైవ్ కాన్సర్ట్.. ఎప్పుడు? ఎక్కడ? రజినీకాంత్ వస్తారా?
తెలుగులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. (Jailer 2)
- Saketh U
- Updated on- October 12, 2026 / 09:46 AM IST
Jailer 2
Jailer 2 : రజినీకాంత్ సూపర్ హిట్ సినిమా జైలర్ కి సీక్వెల్ గా వస్తున్న జైలర్ 2 (Jailer 2)అక్టోబర్ 15న రిలీజ్ కానుంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి అంచనాలే ఉన్నాయి ఈ సినిమాపై. ఇప్పటికే తమిళనాడులో ప్రమోషన్స్ గట్టిగానే చేసారు. తెలుగులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. తెలుగులో ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు.
Also Read : Bigg Boss Elimination : బిగ్ బాస్‌లో మళ్ళీ అన్ ఫెయిర్ ఎలిమినేషన్.. షాలినిని పంపకుండా అపూర్వని ఎందుకు?
జైలర్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు అక్టోబర్ 12న సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి రజినీకాంత్ వస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఆ న్యూస్ లో ఎలాంటి క్లారిటీ రాలేదు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, SJ సూర్య, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, సూర్య వజ్రమోడ్, పలువురు సాంకేతిక నిపుణులు, సంగీత దర్శకుడు అనిరుద్, నిర్మాత నాగవంశీ హాజరు కాబోతున్నారు. ఈ ఈవెంట్లో అనిరుద్ లైవ్ కాన్సర్ట్ కూడా ఉన్నట్టు సమాచారం.
