Rajinikanth : కడప దర్గాని దర్శించుకున్న కబాలి..
తమిళ తలైవా ఇవాళ ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలను వరుసగా సందర్శిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈరోజు తెల్లవారుజామున రజినీకాంత్ మరియు అతని కుమార్తె ఐశ్వర్య తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఇక అక్కడి నుంచి బయలుదేరిన రజినీకాంత్ వైఎస్సార్ జిల్లాలోని కడప పెద్ద దర్గాకి చేరుకున్నారు.
- gum 95921
- Published On : December 15, 2022 / 02:08 PM IST
Rajinikanth visits kadapa dharga
Rajinikanth : తమిళ తలైవా ఇవాళ ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలను వరుసగా సందర్శిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈరోజు తెల్లవారుజామున రజినీకాంత్ మరియు అతని కుమార్తె ఐశ్వర్య తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న రజినికాంత్‌కి.. ఆలయ నిర్వాహుకులు ఘనంగా స్వాగతం పలికారు.
Rajinikanth : బాలాజీని దర్శించుకున్న బాషా..
ఇక అక్కడి నుంచి బయలుదేరిన రజినీకాంత్ వైఎస్సార్ జిల్లాలోని కడప పెద్ద దర్గాకి చేరుకున్నారు. అయితే దర్గాకి రజినీ, ఐశ్వర్యలతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మరియు ఆయన కుమారుడు అమీన్ కూడా చేరుకున్నారు. నలుగురు కలిసి పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గతంలో ఏఆర్ రెహమాన్ ఈ దర్గాని దర్శించుకోగా, కబాలి మాత్రం ఇదే మొదటిసారి.
కాగా ఐశ్వర్య రజినీకాంత్ దర్శకురాలిగా తన మూడో చిత్రాన్ని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నాడు. విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. దీంతో ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక సందర్శనలు ప్రాధాన్యతను సంతరించుకుంది.
