Rakul Preet Singh : రకుల్ డ్రెస్‌ని ఆ వ్యక్తి పట్టుకొని.. వైరల్ అవుతున్న వీడియో.. అసలు విషయం ఏంటో తెలుసా?
‘కెరటం’ సినిమాతో పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). అందంతో పాటు నటన పరంగా ఆకట్టుకుంటూ వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం అమ్మడి ఫోకస్ ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలపై ఉంది. అందుకనే ఈ మధ్య తెలుగులో ఎక్కువగా కనిపించడం లేదు.
- Thota Vamshi Kumar
- Published On : June 13, 2023 / 04:05 PM IST
Rakul in pink Cinderella dress
Rakul Preet: ‘కెరటం’ సినిమాతో పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). అందంతో పాటు నటన పరంగా ఆకట్టుకుంటూ వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసింది అమ్మడు. టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ నటించింది. ప్రస్తుతం అమ్మడి ఫోకస్ ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలపై ఉంది. అందుకనే ఈ మధ్య తెలుగులో ఎక్కువగా కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే.. సోమవారం ఓ ఈవెంట్‌లో రకుల్ పింక్ డ్రెస్‌లో తళుక్కున మెరిపింది. సిండ్రెల్లా డ్రెస్‌లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ చూసిన వారు తమ చూపును తిప్పుకోలేకపోయారు. ఆ డ్రెస్‌లో అంత అందంగా ఉంది రకుల్. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ సెలబ్రిటీ ఫోటో గ్రాఫర్ వైరల్ భయానీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Adipurush : తెలుగు తెర పై శ్రీరాముడిగా కనిపించిన నటులు.. వెండితెరపై మొదటి రాముడు ఎవరో తెలుసా?
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఈ వీడియోలో రకుల్ మెట్లపైకి ఎక్కుతున్న సమయంలో ఆమె డ్రెస్స్ కిందకు ఆనకుండా ఒకరు ఎత్తి పట్టుకోవడం కనిపిస్తోంది. ఇది కాస్త ఎబ్బెట్టుగా ఉందని కొందరు అంటున్నారు. మొత్తంగా ఆ డ్రెస్‌లో రకుల్ ‘బాలీవుడ్ సిండ్రెల్లా’ అంటూ నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రకుల్ ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.
Manoj Manchu : ఆదిపురుష్ సినిమాని వారికి ఫ్రీగా చూపిస్తానంటున్న మంచు మనోజ్.. ఎవరికో తెలుసా..?
ఇదిలా ఉంటే.. ఇటీవల ఓకార్యక్రమంలో పాల్గొన రకుల్ తాను సినిమాల్లో సక్సెస్ కాకపోయి ఉంటే ఏం చేయాలన్న దానిపై ఓ స్పష్టమైన ప్రణాళికతో ఉన్నట్లు చెప్పింది. 20 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు కాలేజీ చదివే రోజుల్లో ముంబైకి వచ్చినట్లు తెలిపింది. ఆ సమయంలో తాను రెండేళ్ల పాటు సినిమాల్లో ప్రయత్నించాలని బావించానని, ఒక వేళ ఆ రంగంలో సక్సెస్ కాకపోతే మాత్రం తిరిగి చదువును కొనసాగించాలని అనుకున్నట్లు తెలిపింది.
సినిమాల్లో నిలదొక్కుకోకపోయుంటే మాత్రం ఫ్యాషన్ విభాగంలో ఎంబీఏ చేయాలని ఆలోచన ఉన్నట్లు తెలిపింది. అయితే.. అదృష్ట వశాత్తు అటువైపు వెళ్లాల్సిన అవసరం రాలేదంది. తన కెరీర్‌ను చక్కగా రూపుదిద్దుకోవడంలో క్రమశిక్షణ అనేది సహపడిందని తెలిపింది. రకుల్ ది ఆర్మీ నేపథ్య కుటుంబం అన్న సంగతి తెలిసిందే. ఆమె తండ్రి ఆర్మీలో అధికారిగా పని చేశారు. దీంతో చిన్నప్పటి నుంచి రకుల్‌కు క్రమశిక్షణ అలవడినట్లు ఆమె చెప్పింది.
Prabhu Deva: 50 ఏళ్ల వయసులో తండ్రైన ఇండియన్ మైఖేల్ జాక్సన్
