Ram Charan : రామ్ చరణ్‌ మొదటి రెమ్యూనరేషన్‌తో ఏమి కొన్నాడో తెలుసా..? ఎక్కువుగా కొనేదేంటో తెలుసా..?

రామ్ చరణ్ తన మొదటి రెమ్యూనరేషన్‌తో ఏమి కొన్నాడో తెలుసా..? తాను ఎక్కువుగా అదే ఎప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటాడని తేజగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Ram Charan buy hand watch with his first remuneration

Ram Charan First remuneration : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ఆన్‌స్క్రీన్ ప్రెజెన్స్ కంటే ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ లో ఎక్కువ అదరగొడుతుంటాడు. తన స్టైలిష్ అవుట్ ఫైట్స్ తో యూత్ ఐకాన్ గా నిలుస్తున్నాడు. తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి అమ్మాయిలు ఫిదా అవుతుంటే, కుర్రాళ్ళు ఏమో తనని ఫాలో అవుతుంటారు. దీంతో ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ మీషో (Meesho) కి తమ సంస్థకి బ్రాండ్ అంబాసడర్ గా రామ్ చరణ్ ని ఎంచుకుంది. ఇక ఈ సంస్థ కోసం చరణ్ చేస్తున్న యాడ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

Ram Charan : ఆస్కార్‌కి వెళ్లిన రాత్రి.. చరణ్ అండ్ ఎన్టీఆర్‌కి రాజమౌళి గట్టి వార్నింగ్ ఇచ్చాడట.. ఎందుకో తెలుసా..?

ఇటీవల స్పై థ్రిల్లర్ తరహాలో తెరక్కించిన ఒక యాడ్ అందర్నీ అలరించింది. ఇక ఈ సంస్థ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో చరణ్.. తన స్టైలింగ్ అండ్ షాపింగ్ విషయాలు గురించి అభిమానులకు తెలియజేశాడు. ఈ క్రమంలోనే తన రెమ్యూనరేషన్ ఏమి కొన్నారు అని చరణ్ ని అడిగితే.. హ్యాండ్ వాచ్స్ (Hand Watch) అంటే తనకి చాలా ఇష్టమని, మొదటి సంపాదనతో వాచ్ కొన్నట్లు తెలియజేశాడు. వాచ్స్ ఎక్కువుగా కొనుగోలు చూస్తుంటానని, తన దగ్గర కొన్ని కలెక్షన్స్ కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

Ram Charan : రామ్ చరణ్ కూడా మనలాగానే.. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఆ పని చేస్తాడంటా.. అదేంటో తెలుసా..?

ఇక తన ఫేవరెట్ వాచ్ ఏంటని ప్రశ్నించగా.. ప్రస్తుతం పటెక్ (Patek Watch) అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. అయితే కరోనా టైంలో కొన్నది మాత్రం తన బెస్ట్ వాచ్ అని తెలియజేశాడు. ఆ పార్సెల్ ఇంటికి వచ్చినప్పుడు చాలా సంతోష పడ్డాడట. మిలిటరీ కలర్ తో ఉన్న ఆ వాచ్ తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్లు వెల్లడించాడు. ఇంతకీ అది ఏ బ్రాండ్ వాచ్ అంటే.. కాసియో వాచ్ (CASIO). ఇప్పటి వరకు కొన్న వాచ్స్ అన్నిటిలో ఇదే తన బెస్ట్ వాచ్ అని తెలియజేశాడు.

ట్రెండింగ్ వార్తలు