×
Ad

Game changer : ‘గేమ్ ఛేంజర్’ కథ ఇదేనా? లీక్ చేసిన అమెజాన్.. IAS ఆఫీసర్ వర్సెస్ అవినీతి..

ఇన్నాళ్లు ఎన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అయినా 'గేమ్ ఛేంజర్' కథ మాత్రం లీక్ అవ్వలేదు.

  • Published On : March 20, 2024 / 10:37 AM IST

Ram Charan Game Changer Movie Story Line Leaked by Amazon Prime

Game changer : రామ్ చరణ్(Ram Charan) నెక్స్ట్ సినిమా గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఒక్క టైటిల్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. కానీ షూటింగ్స్ నుంచి మాత్రం ఫోటోలు, వీడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఇంకా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇటీవలే వైజాగ్ లో షూట్ పూర్తి చేసుకోగా అక్కడి నుంచి కూడా చరణ్ IAS లుక్స్ లో ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయి.

ఇన్నాళ్లు ఎన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అయినా కథ మాత్రం లీక్ అవ్వలేదు. చరణ్ మూడు గెటప్స్ లో కనపడటంతో కథ ఏంటో అర్ధం కాలేదు కానీ డ్యూయల్ రోల్ అని మాత్రం అర్థమైంది. ఇది పొలిటికల్ సినిమా అని, చరణ్ సీఎం అని.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ కథని ఏకంగా అమెజాన్ ప్రైమ్ లీక్ చేసేసింది. అమెజాన్ ప్రైమ్ నిన్న త్వరలో తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ ఓ ఈవెంట్ ని చేసింది. ఆ సినిమాల గురించి తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాటి స్టోరీ లైన్స్ కూడా పోస్ట్ చేసేసింది. ఇంకేముంది గేమ్ ఛేంజర్ స్టోరీ లైన్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

Also Read : Anushka Shetty : అనుష్క పాన్ ఇండియా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్.. క్రిష్ దర్శకత్వంలో.. టైటిల్ ఏంటో తెలుసా?

గేమ్ ఛేంజర్ సినిమాలో.. రామ్ చరణ్ నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. అవినీతి లీడర్స్ ని ఎదుర్కొంటూ, ఎలక్షన్స్ ని రూల్స్ కి తగ్గట్టు నిర్వర్తిస్తూ ఎలాంటి గేమ్ ఆడాడు అనేది స్టోరీ లైన్. ఇక ఇందులో తండ్రిగా రాజకీయాల్లో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. దీంతో ఈ స్టోరీ వైరల్ గా మారింది. శంకర్ అవినీతి కాన్సెప్ట్ తో చేసిన సినిమాలు అన్ని పెద్ద విజయం సాధించాయి. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా కూడా అదే పాయింట్ అని చెప్పడంతో సినిమా విజయం పై మరింత నమ్మకం పెరిగింది.

ఇక గేమ్ ఛేంజర్ సినిమాని సెప్టెంబర్ లో లేదా డిసెంబర్ లో రిలీజ్ చేస్తారని సమాచారం. అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.