Ram Charan : మొన్న గేమ్ ఛేంజర్.. ఇప్పుడు పెద్ది.. పాపం చరణ్ సినిమా అంటే చాలు..

రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4 న రిలీజ్ కానుంది.(Ram Charan)

  • Published on- May 29, 2026 / 04:20 PM IST

Ram Charan

Ram Charan : అసలే సినీ పరిశ్రమలోనే బోలెడన్ని కష్టాలు, సమస్యలు ఉన్నాయంటే వీటికి తోడు లీకులు, పైరసీలు, యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ ట్రోలింగ్స్ తో సినిమాకు మరింత నష్టం జరుగుతుంది. ఇటీవల రామ్ చరణ్ సినిమాకు ఈ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. చరణ్ ఎంత కూల్ గా, అందరితో ఎంత మంచిగా, ముఖ్యంగా ఫ్యాన్స్ తో ఎంత సహనంగా ఉంటాడో అందరికి తెలిసిందే.

నాన్న, బాబాయి పేర్లను కాపాడుకుంటూ వస్తున్నారు చరణ్. కెరీర్ మొదట్లోనే తన లుక్స్ పై ట్రోలింగ్స్ ఎదుర్కున్న చరణ్ ఆ తర్వాత తర్వాత తన సినిమాలు, డ్యాన్స్, నటనతోనే సమాధానం చెప్తూ వచ్చాడు. కానీ కొంతమంది కుదిరినప్పుడల్లా చరణ్ పై, చరణ్ సినిమాలపై నెగిటివిటి ప్రచారం చేస్తున్నారు.

Also Read : Doctor babu : సిక్కిం వెకేష‌న్‌లో భార్య‌తో ఎంజాయ్ చేస్తున్న డాక్ట‌ర్ బాబు.. ఫోటోలు..

రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4 న రిలీజ్ కానుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం చరణ్ తన బాడీని రిస్క్ లో పెట్టి, గాయాలు అయినా చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో చరణ్ లుక్స్ చూస్తేనే చరణ్ ఎంత కష్టపడ్డాడో అర్ధమవుతుంది. అయితే సోషల్ మీడియా వేదికగా కొంతమంది పెద్ది సినిమాపై, చరణ్ పై నెగిటివిటి చేస్తున్నారు. కొంతమంది అయితే సినిమాను పైరసీ చేస్తామని, సినిమా లీక్ చేస్తామని బెదిరింపులకు కూడా దిగుతున్నారు.

ఇప్పటికే పెద్ది టీమ్ సైబర్ సెక్యూరిటీ కి కంప్లైంట్ ఇవ్వడంతో ఇలా పనిగట్టుకొని చరణ్ పెద్ది సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేసే ఓ ఇద్దర్ని పట్టుకున్నారు పోలీసులు. ఆ ఇద్దర్ని విచారిస్తే డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాలో చాలా ఫేక్ అకౌంట్స్ నుంచి చరణ్ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నట్టు తెలిసిందని సమాచారం. దీంతో పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ.. ‘లైగర్’ కి చేసిన తప్పే మళ్ళీ చేస్తాడా?

గతంలో కూడా గేమ్ ఛేంజర్ సినిమాకు రిలీజ్ కిముందే ఇలా నెగిటివ్ ప్రచారం చేసారు. రిలీజ్ అవ్వగానే సినిమాని లీక్ చేసారు. డబ్బులివ్వకపోతే సినిమా లీక్ చేస్తామని డైరెక్ట్ దిల్ రాజునే బెదిరించారు. గేమ్ ఛేంజర్ కి జరిగిన నెగిటివ్ ప్రచారం వల్ల ఆ సినిమా చాలా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు పెద్ది సినిమాకు కూడా ఇలాగే పనిగట్టుకొని నెగిటివిటి ప్రచారం చేస్తుండటంతో పెద్ది టీమ్ సీరియస్ గా లీగల్ యాక్షన్ తీసుకోడానికి సిద్ధమయ్యారు.

అసలు చరణ్ సినిమా అయినా, వేరే హీరో సినిమా అయినా ఎందుకు ఇలా పనిగట్టుకొని నెగిటివ్ ప్రచారం చేయడం, సినిమాలని చంపేయడం ఎందుకు అ