Ram Charan : రామ్ చరణ్ కి ఆపరేషన్.. ఆందోళనలో అభిమానులు.. అంతా ‘పెద్ది’ వల్లే..
ఈ సినిమా కోసం చరణ్ చాలా కష్టపడ్డాడు. (Ram Charan)
- Saketh U
- Published on- May 17, 2026 / 02:26 PM IST
Ram Charan
Ram Charan : రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా భారీగా జూన్ 4న పాన్ ఇండియా వైడ్ భారీగా రిలీజ్ కానుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీగా పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పెద్ది సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం చరణ్ చాలా కష్టపడ్డాడు. బాడీ కోసం, యాక్షన్ సీక్వెన్స్ కోసం చరణ్ చాలా కష్టపడ్డాడు. ఈ క్రమంలో చరణ్ కి గాయాలు కూడా అయ్యాయి. ఇటీవల పలువురు పెద్ది సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు చరణ్ కష్టం గురించి చెప్పుకొచ్చారు. తాజాగా పెద్ది నిర్మాత వెంకట సతీష్ కిలారు మీడియాతో మాట్లాడుతూ చరణ్ గాయాల గురించి మాట్లాడారు.
Also Read : Ram Charn : ఏమున్నాడ్రా బాబు.. రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్ అదుర్స్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..
వెంకట సతీష్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ కి మూడు గాయాలు అయ్యాయి. కంటికి అయిన గాయం అందరికి తెలుసు. కానీ ఆయన మణికట్టుకు కూడా గాయం అయింది. మణికట్టు లోపల చాలా ఎఫెక్ట్ అయింది. అయినా కష్టపడి షూటింగ్ చేసారు. ఆయనకు ఎల్లుండి మణికట్టుకి ఆపరేషన్ ఉంది. షూట్ లో ఉన్నప్పుడు పక్కనే ఫిజియో థెరపిస్ట్ ని పెట్టుకున్నారు. షూట్ గ్యాప్ లో అక్కడే జిమ్ చేసేవాళ్ళు. కుస్తీ పోటీల్లో చాలా సార్లు చరణ్ కి కండరాలు పట్టేస్తే ఫిజియో చేయించుకొని మళ్ళీ వెంటనే వచ్చారు షూట్ కి. చరణ్ కి కాలు కూడా బెణికింది. ఇలా చాలా ఎఫెక్ట్ అయ్యాడు చరణ్ అని తెలిపారు.
తాజాగా చరణ్ ముంబైలో కనిపించగా చేతికి కట్టు ఉంది. అది ఫిజియో చేసి టెంపరరీగా పెట్టినట్టు తెలుస్తుంది. దీంతో చరణ్ కి ఏమైంది అని అభిమానులు కంగారు పడగా నిర్మాత ఇలా క్లారిటీ ఇచ్చారు. రేపు ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయ్యాక చరణ్ ఎల్లుండి మణికట్టు ఆపరేషన్ చేయించుకోబోతున్నారు అని తెలియడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. చరణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read : Praveen : నువ్వు యాక్టర్ కాదా..? జబర్దస్త్ కమెడియన్ ని అందరి ముందు అవమానించిన డైరెక్టర్..
