Ram Charan : మరో పాపులర్ అమెరికన్ టాక్ షోకి రామ్‌చరణ్.. రాజమౌళి పై ఎమోషనల్ కామెంట్స్!

టాలీవుడ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ పలు ఇంటర్వ్యూలు, స్పెషల్ స్క్రీనింగ్స్ కి హాజరయ్యి సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ 'ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్' అనే పాపులర్ అమెరికన్ టాక్ షోకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ టాక్ షోలో..

Ram Charan : టాలీవుడ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. RRR చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో పోటీ పడుతుంది. దీంతో చిత్ర యూనిట్ అక్కడ పలు ఇంటర్వ్యూలు, స్పెషల్ స్క్రీనింగ్స్ కి హాజరయ్యి సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ‘ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్’ అనే పాపులర్ అమెరికన్ టాక్ షోకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ టాక్ షో కూడా గెస్ట్ గా వెళ్లిన మొదటి ఇండియన్ రామ్ చరణ్ కావడం విశేషం.

Ram Charan and Upasana : అమెరికాలో చరణ్, ఉపాసన సందడి..

”ఒక మంచి సినిమాకి భాషతో సంబంధం ఉండదు. RRR దానికి ఒక మంచి ఉదాహరణ. ఆ ప్రాజెక్ట్ లో నేనూ భాగం అయ్యినందుకు నాకు చాలా ఆనందంగాను, గర్వంగాను ఉంది. అటువంటి అవకాశం నాకు ఇచ్చిన మా దర్శకుడు రాజమౌళిని నేను ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటా” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. కాగా గతంలో కూడా పలు పాపులర్ అమెరికన్ టాక్ షోలకు రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్లడంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

కాగా ఆస్కార్ అవార్డుల పురస్కారం మార్చి 12 రాత్రి జరగనుంది. ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం గం.5:30 నిముషాలకు ఆస్కార్ వేడుక మొదలు కానుంది. ఈ కార్యక్రమాని ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఇక ఆస్కార్ వేదిక పై నాటు నాటు సాంగ్ పాడిన కార్తికేయ, రాహుల్ సిప్లిగుంజ్.. లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు పలు భారతీయులు ఆస్కార్ అవార్డుని అందుకున్నారు. కానీ, ఆ అవార్డులు ఇండియన్ సినిమాకు వచ్చినవి కాదు. ఇప్పుడు RRR ఆస్కార్ అందుకుంటే, మొదటి భారతీయ సినిమా చరిత్ర సృష్టిస్తుంది. మరి RRR ఆస్కార్ అందుకుంటుందా? లేదా? చూడాలి.

ట్రెండింగ్ వార్తలు