Ram Charan Janhvi Kapoor Peddi Movie OTT Deal with Netflix for Huge Price
Peddi : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా పెద్ది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ చేసి ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. వచ్చే సంవత్సరం మార్చ్ 27 రిలీజ్ చేస్తామని డేట్ కూడా ఇచ్చేసారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ సినిమా ఆశించినంత ఫలితం రాకపోవడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. తాజాగా పెద్ది సినిమా ఓటీటీ డీల్ వైరల్ గా మారింది.
Also Read : Satya Sri : చిరంజీవిని సెల్ఫీ అడిగాను.. ఆయన ఈవెంట్ అంతా అయ్యాక నా దగ్గరికి వచ్చి మరీ.. ఏడ్చేసాను..
పెద్ది సినిమా నెట్ ఫ్లిక్స్ తో ఓటీటీ డీల్ చేసుకుందని తెలుస్తుంది. అన్ని భాషల్లో కలిపి పెద్ది సినిమాకు 110 కోట్ల ఆఫర్ నెట్ ఫ్లిక్స్ ఇచ్చిందని టాలీవుడ్ సమాచారం. ఈ సినిమా పెద్ద హిట్ అయితే ఆ అమౌంట్ ఇంకా పెరుగుతుంది అనేదానిపై అగ్రిమెంట్ చేసుకున్నారట. సో పెద్ది సినిమా ఎలాగో హిట్ అవుతుందనే అంతా భావిస్తునారు కాబట్టి 110 కోట్లకంటే ఎక్కువే ఓటీటీ నుంచి వస్తుందని తెలుస్తుంది. మొత్తానికి పెద్ది సినిమా రిలీజ్ కి ఇంకా చాలా సమయం ఉన్నా అప్పుడే ఓటీటీకి అమ్ముడు పోవడం గ్రేట్ అంటున్నారు.