Peddi Collections : బాక్సాఫీస్ వద్ద పెద్ది సునామీ.. 300 క్లబ్‌లో రామ్‌చరణ్ మూవీ..
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల (Peddi Collections) సునామీ సృష్టిస్తోంది
- Thota Vamshi Kumar
- Published on- June 9, 2026 / 12:56 PM IST
Ram Charan Peddi Collections five days collections
Peddi Collections : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మూడు వందల క్లబ్‌లో అడుగుపెట్టింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేసింది.
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటించింది. తొలి రోజున ఈ చిత్రం 135.36 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం రానున్న రోజుల్లో మరిన్ని రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
Allu Arjun : పెద్ది మూవీపై అల్లు అర్జున్ రివ్యూ.. నా సోదరుడిని చూసి గర్వపడుతున్నా..
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా ఈ మూవీని నిర్మించగా.. జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, రవి కిషన్ కీలక పాత్రల్లో నటించారు. రామ్‌చరణ్ నటన, గ్రామీణ నేపథ్యం, క్రీడల అంశాలు, ఎమోషనల్ కంటెంట్‌కు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
BOX OFFICE CHAMPION #PEDDI continues his dominance 🔥🔥#Peddi collects a gross of over 315 CRORES + GROSS WORLDWIDE in 5 days ❤🔥#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/e5fZ2thleb
— PEDDI (@PeddiMovieOffl) June 9, 2026
