Peddi Day 7 Collection : రామ్‌చరణ్ పెద్ది మూవీ వారం రోజుల కలెక్షన్ ఎంతంటే?
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన పెద్ది మూవీ బాక్సాఫీస్ (Peddi Collection) వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 11, 2026 / 03:11 PM IST
Ram Charan Peddi Movie first week Collections
Peddi Collection : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. ఈ మూవీ రిలీజ్ అయిన ఏడు రోజుల్లో 345 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్రం బృందం సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేసింది.
రామ్‌చరణ్ నటన, గ్రామీణ నేపథ్యం, క్రీడల అంశాలు, ఎమోషనల్ కంటెంట్ ఉండడంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం మరో రెండు లేదా మూడు రోజుల్లో 400 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
*Mirnaa : చూపులతో మత్తెక్కిస్తున్న మిర్నా మీనన్.. క్యూట్ ఫోటోలు వైరల్..
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో జాన్వీకపూర్ కథానాయిక. జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, రవి కిషన్ కీలక పాత్రల్లో నటించగా.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా లు నిర్మించారు.
