Peddi: ‘పెద్ది’ రిలీజ్ పై మళ్ళీ మొదలైన టెన్షన్.. ఓవర్సీస్ బుకింగ్స్ వాయిదా.. అనుకున్నదే అయిందిగా!

రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది(Peddi) సినిమా మే నెలకి వాయిదా పడే అవకాశం ఉంది.

Ram Charan Peddi Movie Overseas Booking Postponed

  • పెద్ది విడుదలపై ఇంకా రాని క్లారిటీ
  • ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో మార్పులు
  • మరో మూడు వారాలు వాయిదా పడనున్న పెద్ది?

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలపై గత కొద్దిరోజులుగా అనుమానాలు నెలకొన్నాయి. అలాగే, అనేక వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే, ఈ సినిమా మార్చి నుంచి ఏప్రిల్ కి వాయిదా పడిన విషయం తెలిసిందే.

రెడ్ కలర్ డ్రెస్సులో రకుల్ అందాల రచ్చ.. సొగసులు చూసి నెటిజన్స్ ఫిదా

ఇప్పుడు మరోసారి పెద్ది(Peddi) సినిమా వాయిదా పడనుంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈనేపథ్యంలోనే, ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ పరిణామాలు మరింత అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. తాజాగా పెద్ది సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ తేదీలు మార్చి 27 నుంచి ఏప్రిల్ 8వ తేదీకి మారాయి. దీంతో, ఫిలిం సర్కిల్స్‌లో ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాధారణంగా బుకింగ్స్ ఇలా వెనక్కి వెళ్లాయంటే సినిమా విడుదల తేదీలో మార్పు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇక పెద్ది సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని మేకర్స్ భావిస్తున్నారట. ఈ క్రమంలో సినిమాను మే 21, 2026కి అంటే మరో మూడు వారాలు వాయిదా వేయాలని చూస్తున్నారట మేకర్స్. కానీ, రామ్ చరణ్ మాత్రం సినిమాను అనుకున్న సమయానికే తీసుకురావాలని పట్టుదలతో ఉన్నాడట. ఇటీవల సెట్స్‌లో గాయమైనప్పటికీ, ఆయన విశ్రాంతి తీసుకోకుండా తిరిగి షూటింగ్‌లో పాల్గొనడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ అంశాలన్నీ పెద్ది సినిమా విడుదల విషయంలో కొత్త అనుమానులను క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలపై పెద్ది మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.