Peddi Postponed: మెగా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా మరోసారి వాయిదా

రామ్ చరణ్ పెద్ది సినిమా మరోసారి వాయిదా(Peddi Postponed).

Peddi movie once again postponed

Peddi Postponed: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీ మరోసారి మారింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు(Peddi Postponed) చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

Yash: ‘టాక్సిక్’ అలాంటి సినిమా కాదు.. కన్నడ స్టార్ యష్ ఆసక్తికర కామెంట్స్

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను జూన్ నెలకు వాయిదా వేశారు. సినిమా అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.