ram charan peddi movie second song update.
Peddi: గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న మూవీ ‘పెద్ది’. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్ పెద్ది(Peddi)పై అంచనాలను ఒక రేంజ్ లో పెంచేశాయి. అందుకే. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈనేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, పెద్ది సినిమా నుంచి వచ్చిన చికిరి సాంగ్ ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెహ్మాన్ అందించిన ఈ క్యాచీ ట్యూన్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. ఇందులో భాగంగానే పెద్ది సినిమా రెండో సాంగ్ గురించి గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
‘రయ్ రయ్’ అనే లిరిక్స్ తో సాగే ఈ పాట రామ్ చరణ్ పరిచయ గీతంగా ఉండబోతుందట. రెహ్మాన్ ఈ సాంగ్ ని తన స్టయిల్లో కంపోజ్ చేశాడట. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ పాటకు అదిరిపోతే స్టెప్పులు కంపోజ్ చేశాడట. చికిరి సాంగ్ లాగేనే ఈ సాంగ్ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ పాట ఫిబ్రవరి రెండవ వారంలో అంటే ప్రేమికుల దినోత్సవం సందర్బంగా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్. ఇక పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల కానున్నట్టుగా మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.