Peddi: ‘పెద్ది’ సినిమాకు హైప్ అవసరం లేదు.. అదే ముఖ్యం.. సరికొత్త ప్లాన్ చేస్తున్న టీమ్
రామ్ చరణ్ 'పెద్ది(Peddi)' మూవీ విషయంలో క్వాలిటీ పక్కాగా ఉండేలా ప్లాన్ చేస్తున్న టీమ్.
- V Santhosh Kumar
- Published on- April 26, 2026 / 09:50 AM IST
Ram charan Peddi movie team prioritizing quality over hype.
- పెద్ది టీం పక్కా ప్లానింగ్
- హైప్ కన్నా క్వాలిటీకె ప్రాధాన్యత
- రామ్ చరణ్ అప్రూవల్ ఇచ్చాకే నెక్స్ట్ అప్డేట్
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే, ఈ సినిమా విషయంలో మేకర్స్ అనుసరిస్తున్న వ్యూహం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ సిద్ధంగా ఉన్నప్పటికీ, చరణ్ స్వయంగా అప్రూవల్ ఇచ్చే వరకు దానిని విడుదల చేయకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో రాజీ పడకూడదనే పక్కా ప్లాన్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచడంతో, తదుపరి అప్‌డేట్స్ అంతకు మించి ఉండేలా ప్రతి చిన్న విషయాన్ని ఫైన్ ట్యూన్ చేస్తున్నారు.
కేవలం హైప్ కోసం పాకులాడకుండా పర్ఫెక్షన్‌కే ప్రాధాన్యత ఇస్తూ మేకర్స్ అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రమోషన్స్ విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ, సరైన సమయంలో సరైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ జాగ్రత్త చూస్తుంటే ‘పెద్ది(Peddi)’ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. హైప్ కంటే క్వాలిటీ ముఖ్యం అనే ట్యాగ్ లైన్ తో చిత్ర యూనిట్ ముందుకు సాగడం అభిమానులకు మరింత నమ్మకాన్ని కలిగిస్తోంది.
మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న #RC17 ప్రాజెక్ట్ కూడా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. ఈ చిత్రం స్పష్టంగా పాన్ ఇండియా మార్కెట్‌ను, ముఖ్యంగా హిందీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ ప్లాన్ చేస్తున్నారు. ఉత్తరాది మార్కెట్‌లో చరణ్ రేంజ్‌ను మరింత పెంచేలా ఈ చిత్ర స్ట్రాటజీలను రూపొందిస్తున్నారు. మొత్తానికి ఈ రెండు సినిమాలు కూడా రామ్ చరణ్ కెరీర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన సాలిడ్ అవుట్‌పుట్‌ను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
