Peddi : డబ్బింగ్ మొదలుపెట్టిన ‘పెద్ది’.. స్పెషల్ వీడియో రిలీజ్.. నో డౌట్..
నేడు అధికారికంగా పెద్ది సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. (Peddi)
- Saketh U
- Published on- March 1, 2026 / 05:21 PM IST
Peddi
- పెద్ది సినిమా అప్డేట్
- డబ్బింగ్ మొదలుపెట్టిన చరణ్
- చరణ్ వీడియో వైరల్
Peddi : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీగా తెరకెక్కుతున్న సినిమా పెద్ది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉందని సమాచారం.
అయితే ఆల్రెడీ రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ అయిపోయిందని తెలుస్తుంది. నేడు అధికారికంగా పెద్ది సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. డబ్బింగ్ స్టూడియోలో బుచ్చిబాబు దగ్గరుండి రామ్ చరణ్ తో డబ్బింగ్ చెప్పిస్తున్న స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ వీడియోలో చరణ్ డబ్బింగ్ చెప్తూ సరదాగా బుచ్చిబాబుని ఆటపట్టిస్తున్నాడు.
చరణ్ ఇంత సరదాగా మాట్లాడుతూ డబ్బింగ్ చెప్తుండటంతో ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోతో నో డౌట్ సినిమా చెప్పిన డేట్ కి ఏప్రిల్ 30న రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చేసింది మూవీ యూనిట్.
మీరు కూడా చరణ్ డబ్బింగ్ వీడియోని చూసేయండి..
