Peddi Pre Release Date: పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ అనౌన్స్.. ఇది అస్సలు ఊహించలేదు.. ఎక్కడ, ఎప్పుడు తెలుసా?

తాజాగా పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ప్రకటించారు. (Peddi Pre Release Event)

  • Updated on- May 30, 2026 / 11:20 AM IST

Ram Charan Peddi Pre Release Event Date Place Announce

Peddi Pre Release Event : రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా జూన్ 4న పాన్ ఇండియా వైడ్ భారీగా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, ట్రైలర్, సాంగ్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. మూవీ యూనిట్ పాన్ ఇండియా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.

ఇప్పటికే భోపాల్, ముంబై, ఢిల్లీలో ఈవెంట్స్ చేయగా తాజాగా పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ప్రకటించారు. పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 1వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుంచి జరగనున్నట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read – Ram Charan : మొన్న గేమ్ ఛేంజర్.. ఇప్పుడు పెద్ది.. పాపం చరణ్ సినిమా అంటే చాలు..

అయితే పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లేదా విజయనగరంలో ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ రెండిటికి సంబంధం లేకుండా విజయవాడలో చేస్తుండటం గమనార్హం. ఇక విజయవాడలో ప్రీ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే హైదరాబాద్ లో మరో ఈవెంట్ ఉంటుందా ఉండదా అనే సందేహం నెలకొంది.

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా భారీగా పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.