Ram Charan : త్రిష లేదా జాన్వీ.. రామ్‌చరణ్ కుక్కపిల్ల ఫాలోయింగ్ కూడా మాములుగా లేదుగా..

రామ్‌చరణ్ కుక్కపిల్ల రైమ్ గాడి ఫాలోయింగ్ మాములుగా లేదుగా.. త్రిష లేదా జాన్వీ అన్నట్లు ఉంది.

Ram Charan : త్రిష లేదా జాన్వీ.. రామ్‌చరణ్ కుక్కపిల్ల ఫాలోయింగ్ కూడా మాములుగా లేదుగా..

Ram Charan Pet Dog Rhyme with Janhvi Kapoor Trisha

Updated On : March 21, 2024 / 5:05 PM IST

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పెంపుడు కుక్కపిల్ల ‘రైమ్’ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చరణ్ షూటింగ్స్‌లో ఉన్నా, వెకేషన్స్‌లో ఉన్నా.. ఈ రైమ్ కూడా తన వెంటే కనిపిస్తుంది. ఒక చిన్న పాపలా ఆ రైమ్ ని కూడా ఎప్పుడు ఎత్తుకొని తిరుగుతూ కనిపిస్తారు రామ్ చరణ్. ఇక గ్లోబల్ స్టార్ చేతిలో నిత్యం కనిపిస్తుండడంతో.. ఈ రైమ్ గాడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

ఆ ఫాలోయింగ్ ని మరింత పెంచుకోవడం కోసం సోషల్ మీడియాలో ఓ అకౌంట్ ని కూడా ఓపెన్ చేసాడు రైమ్. ఇక ఆ అకౌంట్ నుంచి రామ్ చరణ్, ఉపాసన, క్లీంకారకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ మెగా అభిమానులను ఖుషి చేస్తుంటాడు. తాజాగా రైమ్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో RC16కి సంబంధించిన పోస్టు వేసింది. నిన్న ఆ మూవీ ఓపెనింగ్ కార్యక్రమం తరువాత.. చిత్ర యూనిట్ చిరంజీవి ఇంటిలో సందడి చేసిన విషయం తెలిసిందే.

అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫొటోలోని ఒక దానిలో రైమ్ జాన్వీ కపూర్ పక్కన కూర్చొని కనిపిస్తుంది. ఆ ఫోటోని షేర్ రైమ్ షేర్ చేస్తూ.. ‘కంగ్రాట్యులేషన్స్ నాన్న, జాన్వీ అక్క’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు, RC16 కోసం సెలెక్ట్ చేసుకునే లొకేషన్స్.. తనకి నచ్చేలా ఉండాలని దర్శకుడు బుచ్చిబాబుకి ఆర్డర్ కూడా పాస్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Also read :Rajamouli : జపాన్ యానిమేషన్ మేకర్స్‌తో రాజమౌళి.. SSMB29 కోసమేనా..!

 

View this post on Instagram

 

A post shared by Rhyme Konidela (@alwaysrhyme)

ఇది ఇలా ఉంటే, తాజాగా హీరోయిన్ త్రిష తన ఇన్‌స్టా స్టోరీలో రైమ్ తో ఉన్న వీడియోని షేర్ చేసారు. ‘ఫైనల్లీ రైమ్ ని కలుసుకున్నాను’ అంటూ త్రిష రాసుకొచ్చారు. ఇక ఈ వీడియోని రైమ్ రీ షేర్ చేస్తూ.. “మిస్ యూ. మళ్ళీ ఏప్రిల్ లో కలుదాము” అంటూ పోస్ట్ చేసింది. దీనికి త్రిష రియాక్ట్ అవుతూ.. “ఎదురు చూస్తుంటాను” అంటూ రాసుకొచ్చారు. త్రిష ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక నిన్న జాన్వీతో, ఇవాళ త్రిషతో కనిపించిన రైమ్ ని చూసి మెగా అభిమానులు.. మన రైమ్ గాడి ఫాలోయింగ్ మాములుగా లేదుగా, త్రిష లేదా జాన్వీ అన్నట్లు ఉంది రైమ్ పరిస్థితి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Ram Charan Pet Dog Rhyme with Janhvi Kapoor Trisha Ram Charan Pet Dog Rhyme with Janhvi Kapoor Trisha