Rajamouli : జపాన్ యానిమేషన్ మేకర్స్‌తో రాజమౌళి.. SSMB29 కోసమేనా..!

జపాన్ యానిమేషన్ మేకర్స్‌తో రాజమౌళి. మీతో కలిసి పని చేయడం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ..

Rajamouli : జపాన్ యానిమేషన్ మేకర్స్‌తో రాజమౌళి.. SSMB29 కోసమేనా..!

Rajamouli met Japan anime makers is that for mahesh babu ssmb29

Rajamouli : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం జపాన్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ తో కలిసి స్పెషల్ షోలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక అక్కడి ప్రేక్షకులు తనపై, తన సినిమా పై చూపిస్తున్న ప్రేమకి సంబంధించిన విషయాలను రాజమౌళి తన సోషల్ మీడియా ద్వారా ఇక్కడ అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా రాజమౌళి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర పోస్టు వేశారు.

జాపనీస్ యానిమి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఫేమ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో కూడా చాలామంది ఈ యానిమి సిరీస్ ని చూస్తుంటారు. ఇక ఈ యానిమిస్ పై మన జక్కన్నకి కూడా ఎంతో ఆసక్తి ఉందట. వాటిని అసలు ఎలా క్రియేట్ చేస్తారు..? ప్రాసెస్ ఏంటి..? అనే విషయాలు పై తనకి ఎంతో ఆసక్తి ఉందట. ఇక ప్రస్తుతం జపాన్ లో ఉన్న జక్కన్న.. అక్కడ ఇద్దరు యానిమి క్రియేటర్స్ ని కలుసుకున్నారు.

Also read : Chiranjeevi : చిరంజీవి గెస్టుగా ఆహా సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌.. ఎక్కడ..? ఎప్పుడు..?

వారితో కలిసి యానిమి టెక్నాలజీ గురించి క్రియేటివ్ డిస్కషన్స్ చేశారట. ఆ ఇద్దరు యానిమి క్రియేటర్స్ తో కలిసి ఉన్న ఫోటోలను రాజమౌళి షేర్ చేస్తూ.. “మీతో కలిసి పని చేయడం కోసం ఎదురు చూస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు. ఈ కామెంట్ చూస్తుంటే.. SSMB29 మూవీ కోసం రాజమౌళి జపాన్ యానిమేషన్ మేకర్స్‌తో చేతులు కలపబోతున్నారా అనే సందేహం కలుగుతుంది.

 

View this post on Instagram

 

A post shared by SS Rajamouli (@ssrajamouli)

SSMB29 సినిమా ఇండియన్ జోన్స్ తరహాలో తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం రాజమౌళి ఓ ప్రముఖ హాలీవుడ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన షాట్స్ ని ప్రీ విజువలైజేషన్ చేయిస్తున్నారట. ఈ ఏడాది మే నెలలో ఈ మూవీ పట్టాలు ఎక్కనుందని సమాచారం.