RC 16 Movie : రామ్ చరణ్ RC16 విలన్ అతనేనా? 11 ఏళ్ళ తర్వాత ఆ బాలీవుడ్ స్టార్‌తో చరణ్.. ?

తాజాగా RC16 సినిమా గురించి మరో వార్త వినిపిస్తుంది.

RC 16 Movie : రామ్ చరణ్ RC16 విలన్ అతనేనా? 11 ఏళ్ళ తర్వాత ఆ బాలీవుడ్ స్టార్‌తో చరణ్.. ?

Ram Charan RC 16 Movie Update Villain Role by Bollywood Star

RC 16 Movie : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) RC 16 సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే RC16 ఓపెనింగ్ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ చరణ్ సరసన నటిస్తుంది. ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. గత రెండురోజులుగా సోషల్ మీడియాలో RC16 వైరల్ అవుతూనే ఉంది.

తాజాగా RC16 సినిమా గురించి మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt) నటిస్తాడని సమాచారం. KGF తర్వాత సంజయ్ దత్ సౌత్ లో విలన్ క్యారెక్టర్స్ వరుసగా చేస్తున్నారు. త్వరలో రామ్ డబల్ ఇస్మార్ట్ సినిమాలో కూడా విలన్ గా కనిపించబోతున్నారు. ఇప్పుడు RC16 సినిమాలో కూడా నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.

Also Read : Devara : ‘దేవర’ సెట్స్ నుంచి వీడియో లీక్.. ఎన్టీఆర్ జస్ట్ అలా నడిచొస్తుంటే..

దీంతో చరణ్ కి విలన్ తో మంచి మాస్ సీన్స్ పడతాయని అభిమానులు భావిస్తున్నారు. ఆల్రెడీ చరణ్, సంజయ్ దత్ గతంలో జంజీర్ సినిమాలో కలిసి నటించారు. మరి ఈ RC16 సినిమాలో ఎలా మెప్పిస్తారో చూడాలి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది.

Ram Charan RC 16 Movie Update Villain Role by Bollywood Star