Ram Charan : చిన్ని ‘క్లిన్ కారా’తో తొలి వినాయక చవితి.. చరణ్ స్పెషల్ పోస్ట్.. మెగా ఫ్యాలిలిలో గ్రాండ్‌గా వినాయక చవితి..
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ ఇంట్లో జరిగిన వినాయకచవితి పూజ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో మెగా ఫ్యామిలీ అంతా ఉంది.
- Saketh U
- Published On : September 18, 2023 / 01:58 PM IST
Ram Charan shares Mega Family Vinayaka Chavithi Celebration Photos with klin Kaara
Ram Charan : దేశమంతా నేడు వినాయక చవితి(Vinayaka Chavithi) సంబరాలు చేసుకుంటుంది. వాడవాడలా వినాయకుడి విగ్రహాలు పెట్టి గ్రాండ్ గా పూజలు చేస్తున్నారు. అందరి ఇళ్లల్లో భక్తి శ్రద్దలతో వినాయకచవితి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన సెలబ్రిటీలు కూడా తమ ఇళ్లల్లో వినాయకుడిని పెట్టి పూజలు ఘనంగా చేసుకుంటున్నారు.
ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమ ఇళ్లల్లో జరుపుకున్న వినాయకచవితి ఫోటోలని తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ ఇంట్లో జరిగిన వినాయకచవితి పూజ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో మెగా ఫ్యామిలీ అంతా ఉంది. చిరంజీవి(Chiranjeevi) సురేఖ దంపతులు తమ పిల్లలు, మనవరాళ్లతో పండగని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. చిరంజీవి ఇంట్లోని పూజ గదిలో వినాయకుడుని పెట్టి గ్రాండ్ గా చేసుకున్నారు.
Animal : యానిమల్ వచ్చేస్తుంది.. టీజర్ డేట్ ఫిక్స్.. బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి హవా మరోసారి షురూ..
ఇటీవలే చరణ్ దంపతులకు పాప పుట్టిన సంగతి తెలిసిందే. పాప క్లిన్ కారా పుట్టిన దగ్గర్నుంచి చరణ్ దంపతులు అన్ని పండగలు తమ పాపతో సెలబ్రేట్ చేసుకుంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో కూడా ఉపాసన క్లిన్ కారాని ఎత్తుకుంది. ఇక ఈ ఫోటోలు షేర్ చేసి.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను. ఈ సారి ప్రత్యేకత… చిన్ని ‘క్లిన్ కారా’ తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం అని పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
