Ram Charan Upasana Cute Video edit with Game Changer Song Video goes Viral
Upasana – Ram Charan : రామ్ చరణ్ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి మూడో సాంగ్ నేడు రిలీజ్ కానుంది. ఆల్రెడీ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయడంతో ఈ సాంగ్ వైరల్ గా మారింది. ఈ ప్రోమో వినగానే తమన్ ఇంత మంచి మెలోడీ సాంగ్ కంపోజ్ చేశాడా అని ఫుల్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
Also See : Subbaraju Marriage Photos : నటుడు సుబ్బరాజు పెళ్లి ఫోటోలు చూశారా..?
అయితే ఈ సాంగ్ తో చరణ్ ఫ్యాన్స్.. చరణ్, ఉపాసన క్యూట్ మూమెంట్స్ తో ఒక వీడియో ఎడిట్ చేసారు. చరణ్ – ఉపాసన పాత వీడియోలు తీసుకొని క్యూట్ గా వీడియో ఎడిట్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో ఉపాసన దాకా వెళ్లడంతో ఉపాసనకు ఈ వీడియో బాగా నచ్చేసింది. దీంతో ఈ వీడియోకు రిప్లై ఇస్తూ.. ఈ క్యూట్ ఎడిట్ చాలా బాగుంది. మీ ప్రేమకు ధన్యవాదాలు అని తెలిపింది. ఉపాసన కూడా ఈ వీడియోకు రిప్లై ఇవ్వడంతో ఇది మరింత వైరల్ అవుతుంది. చరణ్ – ఉపాసనలపై చేసిన క్యూట్ వీడియో ఎడిట్ మీరు కూడా చూసేయండి..
What a cute edit. ❤️ ❤️ thank u for all the love. https://t.co/AMtAtr2w0T
— Upasana Konidela (@upasanakonidela) November 28, 2024