×
Ad

Ram Charan : ఇటలీ బయలుదేరిన రామ్ చరణ్ జంట.. వరుణ్ తేజ్ పెళ్లి పనులు కోసమేనా..?

రామ్ చరణ్, ఉపాసన ఇటలీ బయలుదేరారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి పనులు మీదనే..

  • Published On : October 18, 2023 / 02:25 PM IST

Ram Charan Upasana went to Italy is for Varun Tej Marriage works

Ram Charan : రామ్ చరణ్, ఉపాసన ఇటలీ బయలుదేరారు. తమ వారసురాలు క్లీంకార, తమ ఫేవరెట్ పెట్ రైమ్ తో కలిసి చరణ్ అండ్ ఉపాసన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇటలీ బయలుదేరారు. ఎయిర్ పోర్ట్ వద్ద ఉన్న వీరి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్, క్లీంకార మొహం చూపించకుండా జాగ్రత్తపడుతూ ఉపాసన ఉన్న ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరి ఆ ఫోటోలు వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.

Also read : Hi Nanna : నాని ‘హాయ్ నాన్న’ సినిమా.. నాగార్జున సినిమా కథేనా? లేదా తమిళ్ సినిమా కథా?

కాగా మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్ళి జరగబోతున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లితో మెగా ఇంట సందడి మొదలయింది. ఇక ఈ పెళ్లి పనులు అన్ని రామ్ చరణ్ సతీమణి ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ పెళ్లి ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనుందని ఉపాసన రీసెంట్ గా హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మెగా జంట కలిసి ఇటలీ వెళ్తుండడంతో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి పనులు మీదనే వెళ్తున్నారా..? అనే సందేహం కలుగుతుంది.

ఇక ఈ పెళ్లి తేదీ పై మెగా కుటుంబం నుంచి ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. నవంబర్ మొదటి వారంలో ఈ వివాహం జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. గత కొన్నిరోజులు వరుణ్ అండ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రరేషన్స్ జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ముందుగా చిరంజీవి ఇంటిలో ఒక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరగగా, రీసెంట్ గా అల్లు అర్జున్ ఇంటిలో మరో ప్రీ వెడ్డింగ్ జరిగింది. ఇక నెక్స్ట్ సెలబ్రేషన్స్ కి వేదిక ఇటలీ కాబోతుందని తెలుస్తుంది.