Ram Charan : మెగా వెడ్డింగ్‌లో రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా..?

రామ్ చరణ్ మెగా వెడ్డింగ్‌లో ధరించిన ఆ వాచ్ వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి. దాని ధర తెలిస్తే..

Ram Charan watch cost uses in Varun Tej Lavanya Tripathi Marriage

Ram Charan : మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. ఈ బుధవారం (నవంబర్ 1) ఇటలీలోని టస్కనీలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక ఈ వివాహ వేడుక కోసం మెగా, అల్లు, కామినేని, లావణ్య ఫ్యామిలీలతో పటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వరుసగా ఒక్కొక్కటి బయటకి వస్తున్నాయి. ఆ ఫోటోలు అన్ని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వీటిలో బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయి రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆ ఫొటోలో ఇద్దరూ సరదాగా నవ్వుతూ కనిపించారు. ఇక ఫోటో చూసిన మెగా అభిమానులు తెగ మురిసి పోతున్నారు. కాగా ఆ పిక్ లో బాబాయ్, అబ్బాయి ధరించిన వస్తువులను కూడా చాలా బాగా పరిశీలిస్తున్నారు. ఈక్రమంలోనే రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ ని కూడా గమనించారు. ఇక ఆ వాచ్ ఖరీదు ఎంతో తెలుసుకోవడానికి గూగుల్ తెగ వెతికేశారు. చివరికి ఆ రేటుని కూడా తెలియజేసారు.

Also read :Salaar Movie : సలార్ పార్ట్ 2 రిలీజ్ అప్పుడేనా? పార్ట్ 1 ఇంకా రాలేదు పార్ట్ 2 గురించి చర్చ..

రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ పెటక్ ఫిలిప్పీ మోడల్ అంటా. దాని ఖరీదు వచ్చి 285000 డాలర్స్ అని, ఇండియన్ కరెన్సీలో 2 కోట్ల 85 లక్షల ఖరీదు అని చెబుతున్నారు. ఈ ఖరీదు తెలుసుకున్న వారు షాక్ అవుతున్నారు. రామ్ చరణ్ కి వాచ్‌లు అంటే చాలా ఇష్టమని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇప్పటికే తన దగ్గర చాలా వాచ్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. మరి రామ్ చరణ్ మెగా వెడ్డింగ్‌లో ధరించిన ఆ వాచ్ వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.

ట్రెండింగ్ వార్తలు