Ram Charan- Upasana: కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగాస్టార్ ఇంట మెగా సంబరాలు
రామ్ చరణ్- ఉపాసన(Ram Charan- Upasana) దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఉపాసన కవలలకు జన్మనిచ్చారు.
- V Santhosh Kumar
- Published On : February 1, 2026 / 08:05 AM IST
Ram Charan wife Upasana has given birth to a baby girl.
- కవలలకు జన్మనిచ్చిన ఉపాసన
- వారసుడి రాకతో మెగా ఇంట సంబరాలు
- సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని పంచుకున్న చిరజీవి
Ram Charan- Upasana: మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు మొదలయ్యాయి. రామ్ చరణ్- ఉపాసన (Ram Charan- Upasana)దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఉపాసన కవలలకు జన్మనిచ్చారు. అందులో ఒకరు పాప ఒకరు బాబు అవడం విశేషం. ఈ సంతోషకరమైన విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
“తాతయ్యగా నాకు ఇది అత్యంత సంతోషకరమైన సమయం. మా కుటుంబంలోకి ఈ ఇద్దరు చిన్నారులను ఆహ్వానించడం అద్భుతమైన అనుభూతి. మాపై ఇంతటి ప్రేమను కురిపిస్తూ, ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ మా ధన్యవాదాలు.” అంటూ రాసుకొచ్చారు. ఇక మెగా ఫ్యామిలీలో మెగా వారసులు రావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “చిన్న మెగాస్టార్”, “లిటిల్ మెగాస్టార్ ” అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
