Ram Gopal Varma: చావుకు దగ్గరయ్యాను.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ పోస్ట్.. అసలు వర్మకు ఏమయ్యింది?
రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) షాకింగ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- V Santhosh Kumar
- Published On : April 9, 2026 / 05:13 PM IST
ram gopal varma latest shocking look goes viral on social media
- షాకింగ్ లుక్‌లో సంచలన దర్శకుడు
- బర్త్ డే రోజే మరణంపై ఆర్జీవీ వివాదాస్పద పోస్ట్
- వైరల్ అవుతున్న లేటెస్ట్ వీడియో!
Ram Gopal Varma: ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు తన మేకోవర్‌తో అందరినీ షాక్‌కు గురిచేస్తున్నారు. ఏప్రిల్ 7న 63వ పుట్టినరోజు జరుపుకున్న ఆర్జీవీ లేటెస్ట్ లుక్ చూసి ఆయన ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండే వర్మ.. ఇప్పుడు ఒక్కసారిగా బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఆయన ఏదైనా కఠినమైన డైట్ ఫాలో అవుతున్నారా లేక అనారోగ్య సమస్యలేమైనా ఉన్నాయా అని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వయసు పెరుగుతున్నా తనదైన శైలిలో కామెంట్స్ చేసే వర్మ(Ram Gopal Varma).. తన బర్త్ డే రోజున షేర్ చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. “చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను.. కాబట్టి ఇది సెలబ్రేషన్ కాదు” అంటూ ఆయన చేసిన ట్వీట్ ఆయన ఫిలాసఫీకి అద్దం పడుతోంది. అయితే ‘శివ’, ‘సత్య’ వంటి క్లాసిక్స్‌తో ట్రెండ్ సెట్ చేసిన ఆర్జీవీ, మళ్ళీ అలాంటి మాస్టర్ పీస్ తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా బయోపిక్‌లు, బోల్డ్ కంటెంట్‌పైనే ఉండటంతో పాత వర్మను మిస్ అవుతున్నామని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
నిజానికి ఆర్జీవీ ఎప్పుడూ ట్రెండ్‌కు భిన్నంగా ఆలోచిస్తారు. ఆయన హెల్త్ గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ లేకపోయినా, వైరల్ అవుతున్న వీడియోలు మాత్రం ఆయనలో కనిపిస్తున్న మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. ఏదేమైనా ఆ ఫిజిక్ వెనుక ఏదైనా సినిమా ప్లాన్ ఉందా లేక నిజంగానే లైఫ్ స్టైల్ మార్చుకున్నారా అనేది ఆయనే చెప్పాలి. మొత్తానికి ఆర్జీవీ తన లుక్‌తో మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయారు.
