RGV Vyooham Teaser : ఆర్జీవీ ‘వ్యూహం’ టీజర్ రిలీజ్.. కుట్రలకు, ఆలోచనలకు మధ్య..

ఇప్పటికే వ్యూహం నుంచి ఒక టీజర్ విడుదల చేయగా తాజాగా వ్యూహం సినిమా నుంచి మరో టీజర్ ని విడుదల చేశారు ఆర్జీవీ.

  • Published On : August 15, 2023 / 11:10 AM IST

Ram Gopal Varma Vyooham Teaser Released

RGV Vyooham Teaser : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(Rgv) ఒకప్పుడు టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) లో సూపర్ హిట్ సినిమాలు అందించి గత కొన్నాళ్ల నుంచి మాత్రం నా ఇష్టం అంటూ సినిమాలు చేస్తున్నాడు. ఆర్జీవీ ముందు నుంచి కూడా ఏపీ సీఎం జగన్ కు సపోర్ట్ గానే మాట్లాడుతున్నాడు. గతంలో ఎలక్షన్స్ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ టైంకి వ్యూహం అనే పొలిటికల్ సినిమాతో రాబోతున్నాడు.

జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం అనే సినిమాను రెండు పార్టులుగా తెస్తున్నాడు. మొదటి పార్ట్ ఈ సంవత్సరం, రెండవ పార్ట్ ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తానని ప్రకటించారు ఆర్జీవీ. రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ పై జరిగిన కుట్రలు, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది వ్యూహం మొదటి పార్ట్ లో చూపించనున్నారు. ఇప్పటికే వ్యూహం నుంచి ఒక టీజర్ విడుదల చేయగా తాజాగా వ్యూహం సినిమా నుంచి మరో టీజర్ ని విడుదల చేశారు ఆర్జీవీ.

ఇక ఈ టీజర్ లో రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత పరిస్థితులు చూపించారు. ఇక ఇందులో జగన్, జగన్ కుటుంబ పాత్రలతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అరవింద్, సోనియా గాంధీ, రోశయ్య, మన్మోహన్ సింగ్.. ఇలా అనేకమంది పాత్రలని చూపించాడు ఆర్జీవీ. మరి ఈ సినిమా రాజకీయంగా ఏపీలో ఎన్ని ప్రకంపనలు తెస్తుందో చూడాలి. టీజర్ చివర్లో ఏదో ఒక రోజు కళ్యాణ్ ను కూడా వెన్ను పోటు పొడుస్తారు కదా అని చంద్రబాబుని అడగ్గా వాడికి అంత సీన్ లేదు.. వాడిని వాడే వెన్ను పోటు పొడుచుకుంటాడు అనే డైలాగ్ వైరల్ గా మారింది.