Ram Pothineni: డైరెక్టర్ గా రామ్ మొదటి సినిమా.. రేపే షురూ.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
దర్శకుడిగా సరికొత్త ప్రయాణం మొదలుపెట్టనున్న హీరో రామ్ పోతినేని(Ram Pothineni).
- V Santhosh Kumar
- Published on- May 14, 2026 / 02:50 PM IST
Ram Pothineni first film as director set to begin on May 15th
- దర్శకుడిగా మారిన హీరో రామ్
- రామ్ పోతినేని సొంత కథ
- సామ్ సీఎస్ అదిరిపోయే సంగీతం
Ram Pothineni: టాలీవుడ్ ‘ఎనర్జిటిక్ స్టార్’ రామ్ పోతినేని తన కెరీర్‌లో అత్యంత సాహసోపేతమైన అడుగు వేస్తూ తన అభిమానులను షాక్ ఇవ్వనున్నాడు. సుమారు రెండు దశాబ్దాలుగా హీరోగా వెండితెరపై అలరించిన రామ్, ఇప్పుడు తన 23వ చిత్రం (#RAPO23) కోసం మెగాఫోన్ పట్టబోతున్నారు. కేవలం నటుడిగానే కాకుండా, దర్శకుడిగా కూడా రామ్ ఈ చిత్రంతో సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టడం విశేషం. ఈ సెన్సేషనల్ అప్‌డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు (మే 15న) ఉదయం 10:08 గంటలకు వెలువడనుంది.
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’లో ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్.. ఒకే హీరో రెండు ప్రపంచాలు
రామ్ (Ram Pothineni)ఇలా అకస్మాత్తుగా దర్శకుడిగా మారడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఈ కథను ఆయనే రాసుకున్నాడు. తాను స్వయంగా రాసుకున్న కథను వెండితెరపై ఆవిష్కరించే క్రమంలో, ఆ ఎమోషన్‌ను పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేసే దర్శకుడి కోసం ఆయన చాలా కాలం అన్వేషించారు. అయితే, తన మనసులోని ఆ భావోద్వేగాన్ని తనకంటే మెరుగ్గా ఎవరూ చూపించలేరని భావించిన రామ్, చివరకు తన డ్రీమ్ ప్రాజెక్టును తానే డైరెక్ట్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. తనలోని రచయితను, దర్శకుడిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు.
ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఖైదీ, విక్రమ్ వేద వంటి చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన సామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఒకే వ్యక్తి కథా రచయితగా, దర్శకుడిగా, కథానాయకుడిగా బాధ్యతలు చేపట్టడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎనర్జిటిక్ స్టార్ నుండి వస్తున్న ఈ మల్టీ-టాలెంటెడ్ ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని ఇటు సినీ వర్గాలు, అటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
