Ram Pothineni : డబల్ ఇస్మార్ట్ కోసం రామ్ ఎంతలా కష్టపడ్డాడో.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ఫుల్ గా డైట్ చేసి, జిమ్ లో కష్టపడి రామ్ డబల్ ఇస్మార్ట్ కి కావాల్సిన సిక్స్ ప్యాక్ లుక్ తీసుకొచ్చాడు.

Ram Pothineni : డబల్ ఇస్మార్ట్ కోసం రామ్ ఎంతలా కష్టపడ్డాడో.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Ram Pothineni Hard Work for Six Pack Look in Double Ismart Photos goes Viral

Ram Pothineni : టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరోల్లో రామ్ ఒకరు. ప్రతి సినిమాకి చాలా కష్టపడతాడు. తన ఎనర్జీని అంతా సినిమాలో చూపిస్తాడు. రామ్ ప్రస్తుతం డబల్ ఇస్మార్ట్ సినిమాతో రాబోతున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమా కోసం రామ్ బాగా కష్టపడ్డాడు.

డబల్ ఇస్మార్ట్ ముందు స్కంద సినిమా లుక్ నుంచి మళ్ళీ సిక్స్ ప్యాక్ లుక్ లోకి రావడానికి ఫుల్ గా డైట్ చేసి, జిమ్ లో కష్టపడి రామ్ డబల్ ఇస్మార్ట్ కి కావాల్సిన సిక్స్ ప్యాక్ లుక్ తీసుకొచ్చాడు. డబల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ లో రామ్ తన సిక్స్ ప్యాక్ చూపిస్తాడని తెలిసిందే. ఆ మేకోవర్ కోసం రామ్ చాలా నెలలు కష్టపడ్డానని తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

Also Read : Varun Tej : ‘మట్కా’ నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్.. డాన్‌గా వరుణ్ తేజ్?

రామ్ తాజాగా డబల్ ఇస్మార్ట్ కోసం తన బాడీ మేకోవర్ మొదలుపెట్టినప్పటినుంచి కావాల్సిన లుక్ వచ్చేదాకా ఉన్న పలు ఫోటోలు షేర్ చేసి.. డబల్ ఇస్మార్ట్ కోసం మంచి ఫుడ్ తిని, న్యాచురల్ గా జిమ్ చేసినట్లు తెలిపాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక రామ్ లేడీ ఫ్యాన్స్ అయితే సిక్స్ ప్యాక్ లో రామ్ ఏమున్నాడబ్బా అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రామ్ డబల్ ఇస్మార్ట్ కోసం ఫిజికల్ గా కూడా బాగానే కష్టపడ్డాడు అని తెలుస్తుంది. మరి ఇస్మార్ట్ శంకర్ ని మించి డబల్ ఇస్మార్ట్ హిట్ అవుతుందా చూడాలి.

View this post on Instagram

A post shared by RAm POthineni (@ram_pothineni)