Varun Tej : ‘మట్కా’ నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్.. డాన్‌గా వరుణ్ తేజ్?

తాజాగా మట్కా సినిమా నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.

Varun Tej : ‘మట్కా’ నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్.. డాన్‌గా వరుణ్ తేజ్?

Varun Tej First Look Released From Matka Movie Look Like A Don

Updated On : August 11, 2024 / 12:31 PM IST

Varun Tej : వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మట్కా’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో 1960 బ్యాక్‌డ్రాప్‌తో గ్యాంబ్లింగ్ తరహా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో పాన్ ఇండియా సినిమాగా మట్కా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు.

Also Read : Mahesh Babu : వైరల్ అవుతున్న మహేష్ బాబు లుక్.. పిలక వేసి, ఫుల్ గడ్డంతో..

తాజాగా మట్కా సినిమా నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఈ లుక్ చూస్తుంటే వరుణ్ తేజ్ డాన్ గా, తనకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు అని తెలుస్తుంది. గ్యాంబ్లింగ్ ఏరియాకు హెడ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రతిసారి వరుణ్ తేజ్ కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. గత కొన్నాళ్లుగా విజయాలు లేని వరుణ్ కి ఈ ప్రయోగం అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

Image