Mahesh Babu : వైరల్ అవుతున్న మహేష్ బాబు లుక్.. పిలక వేసి, ఫుల్ గడ్డంతో..

ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు ఫ్యామిలీ విజువల్స్ వైరల్ గా మారాయి. మహేష్ బాబు సరికొత్త లుక్స్ చూసి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.

Mahesh Babu : వైరల్ అవుతున్న మహేష్ బాబు లుక్.. పిలక వేసి, ఫుల్ గడ్డంతో..

Photo Credits : Artistry Buzz

Updated On : August 11, 2024 / 12:23 PM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు అంతా ఎదురుచూస్తున్నారు. లుక్స్ పరంగా మహేష్ బాబు మాత్రం ఆ సినిమా కోసం బాగా రెడీ అవుతున్నాడు. గడ్డం పెంచి, ఫుల్ గా జుట్టు పెంచి ఇప్పటికే పలుమార్లు కనపడటంతో మహేష్ లుక్స్ వైరల్ గా మారాయి.

అయితే తాజాగా ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఫ్యామిలీతో సెలెబ్రేట్ చేసుకోడానికి జైపూర్ వెళ్ళాడు. తాజాగా జైపూర్ నుంచి హైదరాబాద్ రిటర్న్ అవుతుండగా జైపూర్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు ఫ్యామిలీ విజువల్స్ వైరల్ గా మారాయి. మహేష్ బాబు సరికొత్త లుక్స్ చూసి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.

Also Read : Comedian Sudhakar : నా చివరి సినిమా అదే.. దాని వల్లే సినిమాలకు దూరమయ్యాను..

మహేష్ బాబుని ఫుల్ గడ్డంతో ఇదే మొదటిసారి చూడటం అని, పిలకతో కూడా ఇదే ఫస్ట్ టైం అని షాక్ అవుతున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. దీంతో మహేష్ బాబు తాజా లుక్స్ వైరల్ గా మారాయి. ఇటీవల అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో క్లీన్ షేవ్ తో కనిపించిన మహేష్ ఇప్పుడు ఇలా ఫుల్ గడ్డంతో కనపడి అందరిని ఆశ్చర్యంలో పడేసాడు. ఇక రాజమౌళి – మహేష్ బాబు సినిమా నుంచి ఏదైనా అప్డేట్ మహేష్ పుట్టిన రోజుకి ఇస్తారనుకున్నారు కానీ ఏది రాకపోవడంతో ఫ్యాన్స్ ఈ విషయంలో నిరాశ చెందుతున్నారు.