Comedian Sudhakar : నా చివరి సినిమా అదే.. దాని వల్లే సినిమాలకు దూరమయ్యాను..

సుధాకర్ నటుడి గానే కాక నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మించారు.

Comedian Sudhakar : నా చివరి సినిమా అదే.. దాని వల్లే సినిమాలకు దూరమయ్యాను..

Comedian Sudhakar Reveals why he Leaves Movies

Updated On : August 11, 2024 / 12:04 PM IST

Comedian Sudhakar : కమెడియన్ సుధాకర్ ఒకప్పుడు ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని నవ్వించాడు. చిరంజీవితో పాటే సినీ పరిశ్రమలోకి వచ్చిన సుధాకర్ 1980 నుంచి తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమాలు చేసారు. చిరంజీవి, సుధాకర్ కెరీర్ మొదట్లో ఒకే రూమ్మేట్స్ అవ్వడంతో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు. సుధాకర్ నటుడి గానే కాక నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మించారు.

అయితే గత కొన్నేళ్లుగా సుధాకర్ అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. గతంలోలాగా కాకుండా అనారోగ్యంతో బలహీన పడటంతో సుధాకర్ ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇటీవల తన కొడుకు బెన్ని కూడా నటుడు అవ్వడంతో అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సుధాకర్. తాజాగా సుధాకర్ తన కొడుకు బెన్నితో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినిమాలు ఎందుకు ఆపేశాడో తెలిపారు.

Also Read : Sai Durgha Tej – Benny : యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక సాయి దుర్గ తేజ్ నన్ను గుర్తుపట్టలేదు.. మళ్ళీ తనే వచ్చి..

సుధాకర్ మాట్లాడుతూ.. వెంకటేష్ సంక్రాంతి నా లాస్ట్ సినిమా. దాని తర్వాతే నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాని వల్లే సినిమాలకు దూరమయ్యాను. ప్రస్తుతం నేను రిటైర్ అయిపోయాను. ఇప్పుడు సినిమాలు చేయలేను. నా కొడుకు నా లోటుని భర్తీ చేయాలను అనుకుంటున్నాను అని తెలిపారు. అయితే సుధాకర్ తనయుడు బెన్ని మాత్రం.. నాన్న ఏజ్ కి తగ్గట్టు ఏదైనా పాత్రలు వస్తే చేపించాలని అనుకుంటున్నాను అని తెలిపాడు. సుధాకర్ సంక్రాంతి సినిమాలో చివరగా నటించినా అతను నటించిన మరి కొన్ని సినిమాలు ఆ తర్వాత కూడా రిలీజ్ అయ్యాయి.