Sai Durgha Tej – Benny : యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక సాయి దుర్గ తేజ్ నన్ను గుర్తుపట్టలేదు.. మళ్ళీ తనే వచ్చి..

ఒకప్పటి స్టార్ కమెడియన్ సుధాకర్ తనయుడు బెన్ని సాయి ధరమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Sai Durgha Tej – Benny : యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక సాయి దుర్గ తేజ్ నన్ను గుర్తుపట్టలేదు.. మళ్ళీ తనే వచ్చి..

Comedian Sudhakar Son Benny Interesting Comments on Sai Durgha Tej

Sai Durgha Tej – Benny : సాయి ధరమ్ తేజ్ కి మూడేళ్ళ క్రితం యాక్సిడెంట్ కి గురయిన సంగతి తెలిసిందే. పెద్ద యాక్సిడెంట్ జరగడంతో సాయి తేజ్ కోలుకోడానికి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పైనే పట్టింది. ఎంతో కష్టపడి ఆపరేషన్స్ చేసి డాక్టర్స్ బతికించగా సాయి తేజ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి పూర్తిగా కోలుకున్నాడు. ఇప్పటికి కూడా హెల్త్ పై ఇంకా ఫోకస్ పెట్టాడు సాయి తేజ్.

తాజాగా ఒకప్పటి స్టార్ కమెడియన్ సుధాకర్ తనయుడు బెన్ని సాయి ధరమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. చిరంజీవి – సుధాకర్ ఫ్రెండ్స్ అవ్వడంతో, గతంలో వీరి ఇళ్లు కూడా ఒకే దగ్గర ఉండటంతో చిన్నప్పట్నుంచి మెగా కజిన్స్ తో సుధాకర్ తనయుడు బెన్నికి కూడా మంచి స్నేహం ఉంది. తాజాగా సుధాకర్, అతని కొడుకు బెన్ని కలిసి నాగబాబు ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

Also Read : Nani Son : నాని తనయుడు కూడా సినీ పరిశ్రమలోకే.. మ్యూజిక్ డైరెక్టర్ గా..?

ఈ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ ప్రస్తావన రాయగా సుధాకర్ తనయుడు బెన్ని మాట్లాడుతూ.. సాయి తేజ్ అన్నకి యాక్సిడెంట్ అయి రికవరీ అయ్యాక ఒకసారి జిమ్ లో కనపడ్డాడు. పాటలు వింటూ జిమ్ చేస్తున్నాడు. నేనే వెళ్లి బెన్నిని అని చెప్పి గుర్తు పట్టారా అని పలకరించాను. కానీ సాయి తేజ్ అన్న నన్ను గుర్తుపట్టలేదు. సరే అని వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను. కానీ కాసేపాగి సాయి తేజ్ అన్నే నా దగ్గరికి వచ్చి సారీ చెప్పి గుర్తుపట్టలేకపోయాను, నాన్న ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. అలాగే బండి మీద డ్రైవ్ చేస్తే కచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయమని చెప్పాడని తెలిపాడు.

అలాగే.. చిన్నప్పుడు నిహారిక వాళ్ళు మా కాలనిలో ఉండేవాళ్ళు. నిహారిక, వరుణ్ తో ఆడుకునేవాళ్ళం. అప్పుడప్పుడు సాయి తేజ్ అన్న కూడా వచ్చేవాడు. అలా చిన్నప్పట్నుంచి అందరూ తెలుసని తెలిపాడు బెన్ని. ప్రస్తుతం బెన్ని నటుడిగా పలు సిరీస్ లు చేస్తున్నాడు. సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తున్నాడు.