Ram Pothineni: ‘వీర’గా రామ్ వైలెంట్ లుక్.. పుట్టినరోజున ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన ఎనర్జిటిక్ స్టార్!

పుట్టిన రోజున తన ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ కొత్త సినిమాను స్టార్ట్ చేసిన హీరో రామ్ పోతినేని(Ram Pothineni).

Ram Pothineni have officially Announced RAPO 23 project

  • రామ్ పోతినేని కొత్త అవతారం.

  • స్వయంగా రామ్ దర్శకత్వం.

  • వీర పాత్రలో వైలెంట్ లుక్.

Ram Pothineni: టాలీవుడ్ ‘ఎనర్జిటిక్ స్టార్’ రామ్ పోతినేని తనదైన నటన, డ్యాన్స్‌తో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ‘దేవదాసు’తో మొదలైన ఆయన ప్రస్థానం, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి మాస్ బ్లాక్ బస్టర్లతో స్టార్ హీరోలా లిస్టులోకి చేరిపోయాడు. కేవలం నటుడిగానే కాకుండా, స్క్రీన్ మీద తన ఎనర్జీతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే రామ్, ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తన 23వ చిత్రంతో ఆయన కేవలం హీరోగానే కాకుండా, దర్శకుడిగా కూడా కొత్త అవతారం ఎత్తుతున్నారు.

Venu Thottempudi: రవితేజ సినిమా చేయడం ఇష్టం లేదు.. ఎంత మొత్తుకున్నా వినలేదు.. చివరికి డిజాస్టర్ అయ్యింది

మే 15న రామ్ (Ram Pothineni)పుట్టినరోజును పురస్కరించుకుని ఈ #RAPO23 ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ రామ్‌ను అత్యంత వైలెంట్ లుక్‌లో చూపిస్తున్నాయి. ఇందులో ఆయన ‘వీర’ అనే పవర్‌ఫుల్ పాత్రను పరిచయం చేశారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో బ్యాక్ లుక్ లో వైలెంట్ గా ఉన్న రామ్ లుక్ చూస్తుంటే, ఈ సినిమా మోస్ట్ వైలెంట్ కంటెంట్ తో రానుందని అర్థమవుతోంది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని మేకర్స్ పోస్టర్ తో అనూన్స్ చేశారు. దాంతో, సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. తనలో ఉన్న దర్శకుడిని ప్రపంచానికి పరిచయం చేస్తూ, కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్‌ను ఆయన సిద్ధం చేస్తున్నారు. షూటింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి, డిసెంబర్ 2026లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ ప్లాన్ చేస్తోంది. నటుడిగా ఎన్నో విజయాలు అందుకున్న రామ్, మెగాఫోన్ పట్టి దర్శకుడిగా ఏ మేరకు మెప్పిస్తారో చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.