Ram Pothineni: రామ్ ‘పవర్’ఫుల్ ప్లాన్.. లోకేష్ కనగరాజ్ శిష్యుడితో యాక్షన్ ఎంటర్టైనర్.. ఈసారి అనిరుధ్ కూడా!

రామ్ పోతినేని(Ram Pothineni) నెక్స్ట్ సినిమాకు మ్యూజిక్ అందించనున్న లేటెస్ట్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్.

Ram Pothineni is doing new movie with Lokesh Kanagaraj assistant

  • హిట్టు కోసం రామ్ క్రేజీ కాంబో
  • కొత్త దర్శకుడితో ఊర మాస్ యాక్షన్ మూవీ
  • మ్యూజిక్ అందిస్తున్న అనిరుధ్

Ram Pothineni: వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, బాక్సాఫీస్ వద్ద మళ్లీ తన సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన డబుల్ ఇస్మార్ట్, ఆంధ్ర కింగ్ తాలూకా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, రామ్ తన తదుపరి చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా, కొత్తదనంతో కూడిన కథలను ఎంచుకుంటూ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Spirit: ఊచకోతకు సిద్ధం అవ్వండి.. ‘స్పిరిట్’ సినిమాపై అనంత్ శ్రీరామ్ సెన్సేషనల్ కామెంట్స్

లోకేష్ కనగరాజ్ వంటి అగ్ర దర్శకుడి వద్ద శిష్యరికం చేసిన అసిస్టెంట్ డైరెక్టర్‌తో రామ్(Ram Pothineni) నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు. లోకేష్ సినిమాల్లో ఉండే ఇంటెన్సిటీ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఈ చిత్రంలోనూ ఉంటాయని సమాచారం. ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా రామ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించేందుకు రెడీ అవుతన్నాడు ఆ దర్శకుడు. ఈ క్రేజీ కాంబినేషన్ గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది అని టాక్.

ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ప్రస్తుతం సౌత్ ఇండియాలో మ్యూజిక్ సెన్సేషన్‌గా మారిన అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించబోతున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అంటేనే సినిమాలకు ఒక కొత్త ఎనర్జీ, హైప్ వస్తుంది. రామ్ ఎనర్జీకి అనిరుధ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్లలో పూనకాలు ఖాయమని చెప్పవచ్చు. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువల మధ్య రూపొందనున్న ఈ సినిమా రామ్ కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొత్త దర్శకుడి విజన్, అనిరుధ్ సంగీతం రామ్‌కి మళ్లీ విజయాన్ని అందిస్తాయా అనేది చూడాలి మరి.