Ram Pothineni: రియల్ హీరో అనిపించుకున్న రామ్ పోతినేని.. అభిమాని కోసం పెద్ద మనసు చాటుకున్న ఎనర్జిటిక్ స్టార్.
అభిమాని కోరిక తీర్చిన హీరో రామ్ పోతినేని(Ram Pothineni).
- V Santhosh Kumar
- Published on- May 21, 2026 / 07:02 PM IST
Ram Pothineni meets a fan suffering from Friedreich Ataxia.
- రామ్ వీరాభిమాని ఇంటికి వెళ్లారు.
- అరుదైన నరాల వ్యాధితో పోరాటం.
- కొత్త సినిమా షూటింగ్ జూన్‌లో.
Ram Pothineni: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తన పెద్ద మనసును చాటుకున్నారు. గత 18 సంవత్సరాలుగా ‘ఫ్రెడ్రిచ్ అటాక్సియా’ అనే అరుదైన నరాల సంబంధిత జన్యు వ్యాధితో పోరాడుతున్న ఓ వీరాభిమాని కోరికను ఆయన నెరవేర్చారు. తనను కలవాలనే సదరు యువతి ఆశయం గురించి తెలిసిన వెంటనే, రామ్ ఎలాంటి హడావుడి లేకుండా నేరుగా ఆమె ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు.
Preethi Asrani: కాశీ విశ్వేశ్వర ఆలయంలో నటి ప్రీతి అస్రాణి.. డివోషనల్ ఫొటోలు వైరల్
అక్కడికి చేరుకున్న రామ్(Ram Pothineni) ఆ యువతితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులతో ముచ్చటించి, అందరితో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నడక, మాట, శారీరక కదలికలపై తీవ్ర ప్రభావం చూపే ఈ ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని కోసం రామ్ తీసుకున్న ఈ చొరవపై నెటిజన్లు “రియల్ హీరో” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు రామ్ పోతినేని తన కెరీర్‌లోని 23వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వోల్ఫ్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా రాబోతోంది. #RAPO23 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ యొక్క రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుండి ప్రారంభం కానుంది.
