RGV : నాగబాబు విమర్శలు కరెక్ట్ అంటున్న RGV..
గత కొన్ని రోజులుగా జనసేన పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ.. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన విమర్శలు కరెక్ట్ అంటూ ట్వీట్ చేశాడు.
- gum 95921
- Published On : February 7, 2023 / 09:17 PM IST
rama gopal varma supporting nagababu comments on movie criticism
RGV : మెగా బ్రదర్ నాగబాబు.. జనసేన పార్టీ పనుల్లో పాల్గొనడం మొదలు పెట్టిన దగ్గర నుండి సినిమా పరిశ్రమకు కొంత దూరంగా ఉంటూ వస్తున్నాడు. టీవీ షోలు కూడా బ్రేక్ ఇచ్చేశాడు. ప్రస్తుతం రాజకీయ విమర్శలు చేస్తున్న వారికీ కౌంటర్లు ఇస్తూ ఎక్కువుగా రాజకీయం పైనే ఫోకస్ పెట్టాడు. తాజాగా సినిమా విమర్శలు చేసే వారికీ గట్టి కౌంటర్ ఇస్తూ నాగబాబు కామెంట్స్ చేశాడు. ఫిబ్రవరి 7 ఉదయం సినిమాల పై విమర్శలు చేసే వారిని ఉద్దేశిస్తూ వరుస ట్వీట్లు చేశాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Nagababu : సినిమా అనేది జస్ట్ బిజినెస్ మాత్రమే.. వాళ్లకు కౌంటర్ ఇచ్చిన నాగబాబు..
సినిమాల్లో చూపించే వైలెన్స్ వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే, మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా. సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసమే ,జనాన్ని బాగు చెయ్యటం కోసమో చెడగొట్టాడని కోసమో తేసేంత గొప్పవాళ్ళు లేరిక్కడ. ఇది కేవలం బిజినెస్ మాత్రమే. సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇది నా ఆన్సర్ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్స్ నాగబాబు ఇప్పుడు ఎవర్ని ఉదేశించి చేశారు అనేది ప్రశ్నగా మారింది.
ఇది ఇలా ఉంటే నాగబాబు వ్యాఖ్యలను కొందరు కరెక్ట్ అంటుంటే, కొందరు కాదంటున్నారు. ఇక గత కొన్ని రోజులుగా జనసేన పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ ఈ విషయంలో నాగబాబుని సమర్దించాడు. మీరు చెప్పింది అక్షర సత్యం అంటూ నాగబాబు ట్వీట్ ని రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా బయట సమాజంలో ఎటువంటి నేరం జరిగిన దానికి కారణం సినిమాలే అంటూ విమర్శలు చేస్తున్నారు చాలా మంది. పుష్ప సినిమా సమయంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కూడా సినిమాల పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆలోచన తీరు మారాలని సినీ పరిశ్రమకు చెందిన వారు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.
Perfectly correct ??? https://t.co/2WpwuXGl54
— Ram Gopal Varma (@RGVzoomin) February 7, 2023
