Ramayana vs Varanasi: ‘రామాయణ’ టీజర్ ఎఫెక్ట్.. ‘వారణాసి’ మూవీకి ఫ్రీ పబ్లిసిటీ.. నువ్వు మాములోడివి కాదు జక్కన్న
'రామాయణ' టీజర్ విడుదల అయిన వేల సోషల్ మీడియాలో 'వారణాసి'(Ramayana vs Varanasi) సినిమా ట్రెండ్ అవుతోంది.
- V Santhosh Kumar
- Published On : April 3, 2026 / 09:37 AM IST
Ramayana vs Varanasi: Director Rajamouli trending on social media
- నెట్టింట రామాయణ vs వారణాసి వార్
- సోషల్ మీడియాలో మహేష్ బాబు ట్రెండింగ్
- రాజమౌళి సినిమాకు ఫుల్ ప్రచారం
Ramayana vs Varanasi: బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ్’. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా వస్తున్న ఈ సినిమా టీజర్ హనుమాన్ జయంతి కానుకగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపిస్తున్న వచ్చిన ఈ గ్లింప్స్‌లో డైలాగులు లేకపోయినా, కేవలం విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే అద్భుతమైన అనుభూతిని అందించారు.
Zee5: ఇంకా షూట్ కూడా స్టార్ అవలేదు.. అప్పుడే రూ.68 కోట్ల భారీ డీల్.. ఇది కదా క్రేజ్ అంటే!
రాముడి పాత్రలో రణబీర్ లుక్ ఎంతో సాఫ్ట్‌గా, దైవికమైన ప్రశాంతతతో ఉండటంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్ చూస్తుంటే ఈ సినిమా భారతీయ వెండితెరపై ఒక దృశ్య కావ్యంలా నిలిచిపోతుందని సినీ ప్రియులు భావిస్తున్నారు. అయితే ఈ టీజర్ విడుదలైనప్పటి నుండి నెట్టింట ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న ‘వారణాసి’ చిత్రంతో ఈ సినిమాను ‘రామాయణ'(Ramayana vs Varanasi) సినిమాను పోలుస్తూ నెటిజన్లు రకరకాల పోస్ట్‌లు పెడుతున్నారు.
‘వారణాసి’లో కూడా మహేష్ బాబు రాముడిగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. దాంతో, ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఎలా ఉండబోతుందోనని చర్చ నడుస్తోంది. తాజాగా వచ్చిన రామాయణ్ విజువల్స్‌ను, గతంలో విడుదలైన వారణాసి టీజర్ సీన్లను పక్కపక్కన పెట్టి వీడియోలు చేస్తూ రెండింటినీ కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ, చిత్రమైన విషయం ఏమిటంటే, నితీష్ తివారీ రామాయణ టీజర్ వల్ల రాజమౌళి చిత్రానికి దేశవ్యాప్తంగా ఫ్రీ పబ్లిసిటీ జరుగుతోంది. ఒక సినిమాకు సంబంధించి అప్‌డేట్ వస్తే, అది రాజమౌళి సినిమాపై ఉన్న అంచనాలను పెంచడం ఆయన క్రేజ్‌కు నిదర్శనమని చెప్పవచ్చు. ఈ విషయంలో “రాజమౌళి ప్లానింగ్ మామూలుగా లేదు” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
