Ramji Dott : మొన్న మిరాయ్.. ఇప్పుడు రావు బహదూర్.. తెలుగులో సరికొత్త VFX అందిస్తున్న రాంజీ..

ఇప్పుడు తెలుగు సినిమాలకు మంచి VFX ని అందించే నిపుణులు వచ్చారు. అందులో రాంజీ డాట్ ఒకరు. (Ramji Dott)

  • Published on- July 5, 2026 / 03:58 PM IST

Ramji Dott

Ramji Dott : ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్ని ఎక్కువగా గ్రాఫిక్స్, VFX పైనే ఆధారపడుతున్నాయి. తెలుగు సినిమాల్లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కావాలి అంటే ముంబై లేదా విదేశాలకు వెళ్లి చేయించేవారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలకు ఇక్కడే VFX చేస్తున్నారు. కొత్త కొత్త నిపుణులు, విదేశాల్లో ట్రైనింగ్ తీసుకొని, బయట పలు సినిమాలకు పనిచేసి ఇప్పుడు తెలుగు సినిమాలకు మంచి VFX ని అందించే నిపుణులు వచ్చారు. అందులో రాంజీ డాట్ ఒకరు. తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ ని ఎండిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్ ఆయన.

విజువల్ ఎఫెక్ట్స్‌ కేవలం సాంకేతిక అవసరంగా కాకుండా కథను మరింత ప్రభావవంతంగా చెప్పడానికి ఉపయోగపడుతుంది. అలా చెప్పడంలో ఇప్పుడు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు రాంజీ. రాంజీ డాట్ ఇప్పటివరకు మహానటి, 118, మసూద, మిరాయ్.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించారు. ఇప్పుడు రావు బహదూర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మహానటిలో పీరియడ్ వాతావరణాన్ని సహజంగా పునఃసృష్టించడం,118లో థ్రిల్లర్‌కు అవసరమైన విజువల్ టోన్‌ను నిర్మించడం, మసూదలో భయాన్ని బలంగా చూపించడం, మిరాయ్ లో ఫాంటసీ ప్రపంచాన్ని ఆవిష్కరించడం, ఇప్పుడు రావు బహదూర్ లో మ్యాజికల్ రియలిజం కాన్సెప్ట్ చూపించడం.. ఇలా ఏ సినిమాకు అవసరమైనట్టు ఆ సినిమాకు పనిచేసి మంచి అవుట్ పుట్ ఇస్తున్నారు రాంజీ.

Also Read : Aamir Khan : 61 ఏళ్ళ వయసులో సైలెంట్ గా మూడో పెళ్లి చేసుకున్న ఆమిర్ ఖాన్.. ఫొటో వైరల్..

రావు బహదూర్ లో సుమారు అరగంటపాటు పూర్తిగా క్రియేటివ్ 3D VFX సన్నివేశాలు ఉన్నాయి. ఆ విజువల్ సీక్వెన్స్‌లను అద్భుతంగా రూపొందించారు రాంజీ. ఇప్పుడు టాలీవుడ్ VFX నిపుణులతో రాంజీ డాట్ ఒకరు. అత్యాధునిక టెక్నాలజీపై పట్టు, సృజనాత్మక ఆలోచన, కథపై అవగాహన ఈ మూడు అంశాలతో రాంజీ ప్రతి సినిమాకు మంచి అవుట్ పుట్ ఇస్తున్నారు.

VFX అనగానే భారీ బడ్జెట్ పెట్టాలనుకుంటారు. కానీ ఇప్పుడు తక్కువ బడ్జెట్ లోనే రాంజీ ఈ అవుట్ పుట్స్ ని టాలీవుడ్ సినిమాలకు అందిస్తున్నారు. ఒక షాట్‌ను కేవలం సాంకేతికంగా ఎలా రూపొందించాలి అనే దానికంటే అది కథలో ఎలాంటి భావోద్వేగాన్ని కలిగించాలి అనే కోణంలో ఆయన VFX షాట్స్ ని రూపొందిస్తారు. కొత్త కథలు, కొత్త ఆలోచనలకు కొత్త దర్శకులకు తన అత్యాధునిక VFX టెక్నాలజీతో ప్రపంచ స్థాయి విజువల్ అందివ్వడానికి రెడీగా ఉన్నాను అంటున్నారు రాంజీ.